పుష్పని మళ్లీ ఆ హీరోకి సెట్ చేసారుగా!
కోర్టు రూమ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్నిఅలరించిన `జాలీ ఎల్ ఎల్ బీ` ప్రాంచైజీ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
కోర్టు రూమ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్నిఅలరించిన `జాలీ ఎల్ ఎల్ బీ` ప్రాంచైజీ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సుభాష్ కపూర్ తెరకెక్కించిన రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించాయి. మొదటి భాగంలో హర్షద్ వార్షీ.. బోమన్ ఇరానీ.. అమృతరావు..సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. అటు పై `ఎల్ ఎల్ బీ-2`లో అక్షయ్ కుమార్..అనుకపూర్..హ్యూమా ఖురేషీ పాత్రలు అద్యంతం అలరించాయి. రెండు భాగాలు నాలుగేళ్ల గ్యాప్ లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. తాజాగా `ఎల్ ఎల్ బీ -3` కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
మూడవ భాగాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నారు. రెండవ భాగంలో ప్రధాన పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ నే హీరోగా కొనసాగుతున్నారు. సుభాష్ కపూర్ దర్శకత్వంలో స్టార్ స్టూడియోస్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసారు. అయితే హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అక్షయ్ కి వైఫ్ పాత్ర పుష్ప పాండేగా ఎవరు నటిస్తారు? అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆ ఛాన్స్ హ్యూమా ఖురేషీకే ఇస్తారా? లేక కొత్త హీరోయిన్ ని తీసుకుంటారా? అని పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ నాదే అంటూ హ్యూమా ఖురేష్ సస్పెన్స్ కి తెరదించేసింది. `పుష్ప పాండే మళ్లీ` వచ్చిం దంటూ ఇన్ స్టా వేదికగా విషయాన్ని చెప్పేసింది. దీంతో మరోసారి అక్షయ్ కుమార్-హ్యామా సందడి థియేటర్లో షురూ అయింది. ఇద్దరి కాంబినేషన్ లో మంచి సీన్లు పడితే ఎలా ఉంటుందో రెండవ భాగంలో చూసారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు మరోసారి హ్యూమాఖురేషీకే ఆ ఛాన్స్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి అన్ని పనులు పూర్తి చేసి అదే ఏడాది చివర్లో నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.వాస్తవానికి ఈ చిత్రాన్ని కూడా నాలుగేళ్ల గ్యాప్ లోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ అక్షయ్ బిజీ షెడ్యూల్ కారణంగా వీలుపడలేదు.