ఐకాన్ స్టార్ ముందుకు ఫైనల్ డ్రాప్ట్!
ఈసారి బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రధాన మార్పుల గురించి ఈ చర్చ జరుగుతుం దని అంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్దం అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది. మైథలాజికల్ టచ్ తో రూపొందించిన స్టోరీ ఇది. ఇంత వరకూ ఈ కాంబినేషన్ లో ఫెయిల్యూర్ లేదు. చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. దీంతో అంచనాలు ఏర్పడటం సహజమే. అయితే త్రివిక్రమ్ కి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. కానీ బన్నీకి మాత్రం మూడవ చిత్రం.
'పుష్ప' రెండు భాగాలతో పాన్ ఇండియాలో అతడో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పుష్ప-2తో ఏకంగా బాహుబలి రికార్డులే బ్రేక్ చేసాడు. దీంతో పాన్ ఇండియాలో అతడి మార్కెట్ అంతకంతకు రెట్టింపు అయింది. ప్రస్తుతం అతడి స్టార్ డమ్ పీక్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో గురూజీతో ఐకాన్ స్టార్ ఆ అంచనాలు అందుకునే సినిమా చేయాలి. ఆ బాధ్యత మాత్రం గురూజీదే. అతడిపై ఉన్న నమ్మకంతో బన్నీ మరో ఆలోచన లేకుండా గురూజీకి తొలి పాన్ ఇండియా సినిమా అయినా? కాన్పిడెంట్ గా మూవ్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కూడా స్టోరీ విషయంలో అంతే కేర్ పుల్ గా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ లాక్ అయినా నిత్యం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్టోరీకి సంబంధించి వీలైనంత బెటర్ మెంట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫైనల్ డ్రాప్ట్ స్టోరీని మరోసారి బన్నీకి వినిపించబోతున్నాడుట. ఈనెలఖరున ఇద్దరి మధ్య మళ్లీ స్టోరీ డిస్కషన్ జరుగుతుందని సన్నిహిత వర్గాల సమాచారం.
ఈసారి బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రధాన మార్పుల గురించి ఈ చర్చ జరుగుతుం దని అంటున్నారు. బన్నీకి స్టోరీ లైన్ వినిపించినప్పటికీ నుంచి త్రివిక్రమ్ ట్రావెల్ అవుతున్నారు. కానీ 'పుష్ప-2' రిలీజ్ అనంతరం మాత్రం ఇంత వరకూ మరో డిస్కషన్ జరగలేదుట. ఈ నేపథ్యంలోనే ఫైనల్ డ్రాప్ట్ తో మరోసారి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.