RC 16లో బాలీవుడ్ హీరోనా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథని దర్శకుడు బుచ్చిబాబు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయ్యింది. దేవర తరువాత తెలుగులో ఆమెకి ఇది రెండో పాన్ ఇండియా మూవీ.
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ షూటింగ్ ని దర్శకుడు బుచ్చిబాబు ప్రారంభించారు. మైసూర్ లో మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇక సినిమా కోసం హైదరాబాదులో ప్రత్యేకంగా ఒక విలేజ్ సెట్ వేసినట్లు తెలుస్తోంది.
ఆ సెట్ లోనే నెక్స్ట్ కీలకమైన షెడ్యూల్ జరగబోతుందని సమాచారం. ఇక సినిమా కోసం రామ్ చరణ్ స్పెషల్ గా సిద్ధమయ్యారు. డిఫరెంట్ లుక్ లో రామ్ చరణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఐదు నిమిషాల నిడివిలో రణబీర్ కపూర్ పాత్ర ఉంటుందని సమాచారం.
బుచ్చిబాబు రణబీర్ కపూర్ ని కలిసి మూవీ స్టోరీ, అతని క్యారెక్టర్ గురించి చెప్పారంట. స్టోరీ విని మూవీలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే కచ్చితంగా ‘RC 16’ కి నెక్స్ట్ లెవెల్ హైప్ వస్తుందని చెప్పొచ్చు. మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర కోసం ఒక స్టార్ హీరోని ఎంపిక చేసే ప్రయత్నంలో బుచ్చిబాబు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ‘RC 16’ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు. టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ ఉండటంతో సినిమాపైనే అంచనాలు హెవీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది ‘RC 16’ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.