బిగ్ ట్విస్ట్... సైఫ్ ఇంట్లో నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ అవ్వలేదా?
మరోపక్క నిందితుడితో క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేసేపనిలో పోలీసులు బిజీగా ఉన్నారని.. కీలక విషయాలు సేకరించారని మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఇటీవల బాంద్రాలోని తన నివాసంలో దుండగుడితో జరిగిన పెనుగులాటలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెలిసిందే. మరోపక్క నిందితుడితో క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేసేపనిలో పోలీసులు బిజీగా ఉన్నారని.. కీలక విషయాలు సేకరించారని మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఇలా బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో నిందితుడిగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ సమయంలో దాడి జరిగిన సైఫ్ అలీఖాన్ నివాసంలోని గదిలో లభించిన ఫింగర్ ప్రింట్స్ లో నిందితుడి పింగర్ ప్రింట్స్ సరిపోలడం లేదని జాతీయ మీడియా పేర్కొనడం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
అవును... సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా సైఫ్ ఇంట్లో, దాడి జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన వేలిముద్రలతో, నిందితుడిగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదని బాంద్రా పోలీసులకు ఫోరెన్సిక్ టీమ్ వెల్లడించినట్లు చెబుతున్నారు.
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించి, నటుడి కుమారుడు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడని, ఈ సమయంలో ఆ గదిలోకి వచ్చిన సైఫ్ నుంచి తప్పించుకునే క్రమంలో దాడి చేశాడని చెబుతున్న నేపథ్యంలో.. ఇన్వెస్టిగేషన్ టీం అక్కడ ఉన్న సూమారు 19 వేలిముద్రలను సేకరించిందంట.
అయితే... ఆ 19 వేలిముద్రల్లో దేనితోనూ నిందితుడి పింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడం లేదని అంటున్నారు. దీంతో.. ఫోరెన్సిక్ టీమ్ మరోసారి ఘటన స్థాలానికి వెళ్లి, మరిన్ని వేలిముద్రలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో... వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయని చెబుతున్నారు!
కాగా... ఈ కేసు విచారణ కోసం సైఫ్ బ్లడ్ శాంపుల్స్ ని పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆ ఘటన జరిగిన రోజు సైఫ్ ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మరోపక్క నిందితుడి దుస్తులపైనా రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ వేనా.. కాదా.. అని నిర్ధారించాల్సి ఉంది!