RED పోస్ట‌ర్‌ వేస్తే చాలు 1000 కోట్లు?

ఏదైనా సినిమా హిట్ట‌యితే దాని వెన‌క ప‌ని చేసిన సెంటిమెంట్‌ని ఇత‌రులు అనుస‌రిస్తుంటారు.

Update: 2024-04-07 11:02 GMT

చిత్ర‌పరిశ్ర‌మ‌లో సెంటిమెంట్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. లాంచింగ్ పూజా కార్య‌క్ర‌మాలు మొద‌లు అడుగ‌డుగునా సెంటిమెంట్ ని అనుస‌రించే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌న‌కు ఉన్నారు. ఏదైనా సినిమా హిట్ట‌యితే దాని వెన‌క ప‌ని చేసిన సెంటిమెంట్‌ని ఇత‌రులు అనుస‌రిస్తుంటారు. అందుకే సినీరంగాన్ని విచిత్రంగా చూస్తుంటారు.

ఇటీవ‌ల‌ ఎరుపు బ్యాక్‌గ్రౌండ్ పోస్ట‌ర్‌ వేస్తే చాలు 1000 కోట్లు వ‌సూలైన‌ట్టే! అన్న సెంటిమెంట్ బ‌లంగా వినిపిస్తోంది. ఇంత‌కుముందు యానిమ‌ల్, జ‌వాన్ ల‌కు ఈ ఫార్ములా వ‌ర్క‌వుటైంది.అందుకే ఇప్పుడు పుష్ప 2 కి కూడా ఇదే సెంటిమెంట్ ని అనుస‌రించి రెడ్ పోస్ట‌ర్ ని వేసారు. బ‌న్ని అభిమానులు నెటిజ‌నులు..దీనిని సెంటిమెంట్ గానే భావిస్తున్నారు. పుష్ప కూడా యానిమ‌ల్, జ‌వాన్ ల‌క్ ఫ్యాక్ట‌ర్ ని ఫాలో అవుతోంది అన్న ప్ర‌చారం మొద‌లైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ విజయానికి ఎరుపు రంగు పోస్ట‌ర్ స‌హ‌క‌రిస్తుంద‌ని అంతా న‌మ్ముతున్నారు.

పుష్ప 2 నిర్మాతలు 8ఏప్రిల్ 2024న టీజర్ విడుదలకు ముందు అభిమానులకు కొత్త పోస్టర్‌ను చూపించారు. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పుష్పరాజ్‌ అనే స్మ‌గ్ల‌ర్ పాత్రలో బ‌న్ని నటిస్తున్నారు. కొత్త పోస్టర్‌లో అల్లు అర్జున్ శివునికి ప్రతీకగా కనిపించే లుక్‌లో క‌నిపించారు. వెర్మిలియన్ ఎరుపు రంగులో స్ప్లాష్‌గా కనిపించే పోస్టర్‌లో అల్లు అర్జున్ శక్తివంతమైన అవతార్‌లో విస్మయాన్ని కలిగించాడు. నిన్నటి పోస్టర్ తర్వాత ఘాడ‌మైన‌ ఎరుపు రంగు నేప‌థ్యంలో బ‌న్ని అభిమానులు సెంటిమెంట్ ని గుర్తించారు.

ఎరుపు రంగు బాక్సాఫీస్ మాయాజాలానికి పర్యాయపదం అంటూ విశ్లేషిస్తున్నారు. ఎరుపు రంగు ఆశయం, అభిరుచి, స్ట్రెంగ్త్‌తో ముడిపడి ఉంటుంది. ఇది ఆధిపత్యం, నైపుణ్యాన్ని, డామినేష‌న్ ని సూచిస్తుంది. బాగా ఎరుపు రంగులో పోస్టర్లు వేసిన‌ప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఆధిపత్యం వహించిన కొన్ని చిత్రాల వివ‌రాల‌ను .. వాటి బాక్సాఫీస్ పనితీరును ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులివి.

ర‌ణ‌బీర్ యానిమ‌ల్ చిత్రానికి ఎరుపు రంగు పోస్ట‌ర్లు వేసాడు సందీప్ వంగా. గొడ్డ‌లి చేత‌ప‌ట్టిన‌ క‌థానాయ‌కుడిని హైలైట్ చేస్తూ మొద‌టి పోస్ట‌ర్ ర‌క్తంలో త‌డిసిముద్ద‌యింది. అలాగే బాబీ డియోల్ రక్తంలో చిందులేసిన పోస్ట‌ర్ ని కూడా ముద్రించారు. విమర్శ‌లు ఎన్ని ఎదురైనా కానీ, అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచిన ఎలిమెంట్స్ ఇవి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 900 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన‌ కొన్ని పోస్టర్లలో ఎరుపు రంగు ప్రధానంగా హైలైట్ అయింది.

షారూఖ్ ఖాన్ `జవాన్‌`కి సంబంధించిన పోస్టర్‌ని ఎరుపు రంగు ప్రాధాన్య‌త‌తో వేయ‌డం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. మొదటి పోస్టర్‌లో షారూఖ్ ఖాన్ రెడ్ షర్ట్‌లో ఉన్నాడు. `జవాన్` బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. సింగం 3 పోస్టర్లు కూడా ఎరుపు రంగులో ఆస‌క్తిని క‌లిగించాయి. ఇక్కడ ఎరుపు రంగు బాక్సాఫీస్ విజ‌యానికి X కారకం అని భావించాల్సి ఉంటుంది.

అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక నటించిన `షైతాన్` ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది క్లీన్ హిట్. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పోస్టర్ ఎరుపు - నలుపు రంగులో ఉంది. ఇక్కడ ఎరుపు రంగు నేప‌థ్యం ప్రత్యేకంగా ఆక‌ర్షించింది. లక్షలాది మంది లార్డ్ శివుడిని విశ్వసించే భారతదేశంలో ఇది అన్ని రాష్ట్రాల్లో సరైన ప్రభావాన్ని చూపింది.

సినిమా హిస్ట‌రీలో చాలా బాక్సాఫీస్ హిట్ చిత్రాల పోస్ట‌ర్లు ఎరుపు రంగు నేప‌థ్యాన్ని క‌లిగి ఉన్నాయి. ఎరుపు రంగు మ‌న‌సుపై ఘాడ‌మైన ముద్ర‌ను వేస్తుంది. ఇక డార్క్ టోన్ తో ముద్రించిన ఏ పోస్ట‌ర్ అయినా యూనిక్ నెస్ తో ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా మాస్, యువ‌త‌రాన్ని వేగంగా ఆక‌ర్షించే శ‌క్తి ఎరుపు రంగు పోస్ట‌ర్ కి ఉంద‌నేది సైకాల‌జిస్టుల విశ్లేష‌ణ‌.

Tags:    

Similar News