బాలీవుడ్‌కి వెళ్లాక సౌత్ ఛాన్సులు కోల్పాయా: ఇలియానా
ఇటీవల జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ..''నిజానికి నేను దక్షిణాది నుంచి షిఫ్ట్ అవ్వాలని అనుకోలేదు.
ఇలియానా డి క్రజ్ పరిచయం అవసరం లేదు. దేవదాసు, జల్సా, పోకిరి, కిక్, నన్బన్, రుస్తోమ్ సహా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది. గ్లామరస్ పాత్రలతో యూత్ హార్ట్ బీట్ అని నిరూపించుకుంది. అయితే ఈ భామ సౌత్ ని వదిలేసి అనూహ్యంగా బాలీవుడ్ కి వెళ్లిపోయింది. 2012లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే మళ్లీ ప్రాంతీయ సినిమాలు చేయనని జనాలు భావించినందున చాలా సౌత్ సినిమా ఆఫర్లను కోల్పోయిందిట.
బర్ఫీ ఇలియానాకు బ్లాక్ బస్టర్ ఆరంగేట్రం. ఇందులో రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా డిక్రూజ్ ప్రధాన పాత్రలు పోషించారు. పీరియాడికల్ రొమాంటిక్ కామెడీలో ఇలియానా నటనకు పేరొచ్చింది. ఈ సినిమా ఒక్క ఇండియా నుండే 120 కోట్ల నికర వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇలియానా 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డ్‌ను కూడా గెలుచుకుంది.
బర్ఫీలో తన నటనకు మంచి సమీక్షలు విస్తృతమైన ప్రశంసలను పొందింది. కానీ అదే సమయంలో దురదృష్టవశాత్తు అనేక సౌత్ సినిమా అవకాశాలను కోల్పోయింది. ఇటీవల జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ..''నిజానికి నేను దక్షిణాది నుంచి షిఫ్ట్ అవ్వాలని అనుకోలేదు. బర్ఫీని కథగా ప్రేమించడం వల్ల నేను హిందీ సినిమా చేసాను. ఇది అసాధారణమైన చిత్రం అని అనుకున్నాను. నేను అలాంటి సినిమా చేయడం లేదా అలాంటి అవకాశం మళ్లీ మళ్లీ నా వైపు రావడం నేను నిజంగా చూడలేదు. ఇలాంటి అవకాశం ఒక్కసారి మాత్రమే.. దానిని వదులుకోవడం తెలివితక్కువతనం నేను అనుకున్నాను'' అని అన్నారు.