ఇండియన్ 3.. ఎక్కువ సంపాదించుకుంటున్న శంకర్

రెండు భాగాలు అనే ఐడియా కొందరు దర్శకులకు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు రావడం లేదు. సినిమా షూటింగ్ టైమ్ లో నిడివి పెరిగిపోతూ ఉండడంతో ఆ తరువాత ఆలోచనా విధానం ఒక్కసారిగా మారుతోంది.

Update: 2023-11-13 09:19 GMT

రెండు భాగాలు అనే ఐడియా కొందరు దర్శకులకు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు రావడం లేదు. సినిమా షూటింగ్ టైమ్ లో నిడివి పెరిగిపోతూ ఉండడంతో ఆ తరువాత ఆలోచనా విధానం ఒక్కసారిగా మారుతోంది. రెండు భాగాలు అనేది ఇప్పుడు పెద్ద సినిమాలకు చాలా కామన్ వినిపిస్తున్న పేరు. ఇండియన్ 2 కూడా మరో భాగంతో రాబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ వచ్చింది.

ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు శంకర్ మద్యలో కాస్త మానసికంగా ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు రెండు భాగాలుగా తెరపైకి రూపొందిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. కమల్ హాసన్ హీరోగా అప్పుడెప్పుడో వచ్చిన ఇండియన్ సినిమాకు కొనసాగింపుగా ఇండియన్ 2ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ కంటెంట్ బాగా పెరిగిపోవడంతో ఎడిటింగ్ లో తీసేయడం ఇష్టం లేక మళ్ళీ లైకా ప్రొడక్షన్ నిర్మాతలు మరొక భాగంగా విడుదల చేయాలి అని దర్శకుడికి సూచించారు.

అయితే అలా చేస్తే స్క్రిప్ట్ లో కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అని, అంతే కాకుండా వర్కింగ్ డేస్ కూడా పెరుగుతాయి అని ముందుగానే చెప్పాడు. అయినప్పటికీ నిర్మాతలు శంకర్ తో కాస్త విభేదాలు ఉన్నప్పటికీ కూడా పార్ట్ 3 కోసం మరికొంత ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడవ భాగం కోసం చాలా సీన్స్ షూట్ చేశారు.

అంతేకాకుండా నలభై రోజులు అదనంగా వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి దర్శకుడు అలాగే హీరో కమల్ హాసన్ కూడా వారికి రేంజ్ కు తగ్గట్టుగానే నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ అదనంగా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియన్ 2 సినిమాను 2024 ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఇండియన్ 3 సినిమాను మరో ఆరు నెలల గ్యాప్ లో విడుదల చేసేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇక దర్శకుడు శంకర్ మరొకవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందించిన ఈ సినిమా అసలైతే ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాలి. కానీ శంకర్ ఆగిపోయిన ఇండియన్ 2 ప్రాజెక్టును మొదలుపెట్టడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై పడింది. ఇక ఒక వైపు ఇండియన్ 2 ప్రాజెక్టుతో బిజీగా ఉంటేనే మరొకవైపు శంకర్ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా విడుదలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News