ఇండియన్ పోలీస్ ఫోర్స్ టాక్ ఏంటి..?

ఇండియన్ పోలీస్ ఫోర్స్ ట్రైలర్ సీరీస్ పై ఆసక్తి కలిగేలా చేసింది అయితే సీరీస్ మాత్రం ఆ రేంజ్ అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు.

Update: 2024-01-21 07:00 GMT

ఈమధ్య మేకర్స్ అంతా కూడా సినిమాలకు ఈక్వల్ గా వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటున్నాయి. మన దగ్గర కన్నా బాలీవుడ్ లో ఇలాంటి సీరీస్ లు వస్తున్నాయి. అక్కడ వెబ్ సీరీస్ లు చేసేందుకు స్టార్స్ కూడా ఆసక్తితో ఉన్నారు. అలాంటి భారీ బడ్జెట్ అదే రేంజ్ స్టార్ కాస్ట్ తో వచ్చిన వెబ్ సీరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి లీడ్ రోల్ లో నటించిన ఈ వెబ్ సీరీస్ ను సుష్వంత్ ప్రకాష్ బాధ్యతలు వహించారు. హిందీలో తెరకెక్కిన ఈ సీరీస్ ను సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.

ఇండియన్ పోలీస్ ఫోర్స్ ట్రైలర్ సీరీస్ పై ఆసక్తి కలిగేలా చేసింది అయితే సీరీస్ మాత్రం ఆ రేంజ్ అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు. ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లతో రెండు వందల మంది చనిపోతారు. డిసిపి కబీర్ (సిద్ధార్థ్ మల్హోత్రా), సిపి విక్రం (వివేక్ ఒబెరాయ్) లు కలిసి ఆ కేసు విచారణ చేస్తుంటారు. వీళ్లకు సపోర్ట్ గా ఏ.టి.ఎస్ స్పెషల్ ఆఫీసర్ తారా (శిల్పా శెట్టి) నిలుస్తుంది. ఈ బ్లాస్టింగ్ చేసిన జరార్ (మయాంక్ టాండన్) పోలీసులకు దొరక్కుండా జైపూర్, గోవా తిరుగుతుంటాడు. అక్కడ కూడా ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ లను చేస్తుంటాడు. ఐతే ఈ ఆపరేషన్ లో విక్రం మరణిస్తాడు. డాకాలో ఉంటున్న జరార్ లో పట్టుకునేందుకు టీం అన్ అఫీషియల్ గా వెళ్తుంది. అతన్ని ఎలా పట్టుకున్నారు అన్నదే సీరీస్ కథ.

ఏడు సీరీస్ లతో వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ ను రోహిత్ శెట్టి, సుష్వంత్ ప్రకాష్ కలిసి తెరకెక్కించారు. ఇలాంటి రెగ్యులర్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. సీరీస్ లు కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ పోలీస్ ఫోర్స్ కూడా అదే రెగ్యులర్ స్టఫ్ తో వచ్చింది. ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు, ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే అంశాలు లేవు. భారీ యాక్షన్ సీన్స్ కొంతమేరకు పర్వాలేదు అనిపించినా రొటీన్ కథ అయ్యే సరికి ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. భారీ స్టార్ కాస్ట్.. బడ్జెట్ ఉన్నా అరిగిపోయిన రొటీన్ కథతో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ ఓటీటీ ఆడియన్స్ మెప్పు పొందలేదని చెప్పొచ్చు.

ఈమధ్య వెబ్ సీరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతున్నాయి. అయితే డిఫరెంట్ కథ.. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లేతో వస్తే సీరీస్ లు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీరీస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. వెబ్ సీరీస్ ట్రైలర్ తో ఆడియన్స్ కు మంచి హై తెప్పించినా సీరీస్ లో యాక్షన్ బ్లాగ్స్ తప్ప మిగతా కథ అంత పాత చింతకాయ పచ్చడిలానే అనిపించింది.

Tags:    

Similar News