భారతదేశంలో అత్యంత సంపన్న నటుడు!
ఏ ఇతర స్టార్ హీరోతో పోల్చినా కింగ్ ఖాన్ షారూఖ్ అంబానీ రేంజు. షారుఖ్ ఖాన్ రూ. 6300 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశపు అత్యంత సంపన్న నటుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
అవును .. స్టార్ హీరోల్లో ఆయన అంబానీ రేంజు. తన ఆస్తులు అంతస్తులు లైఫ్ స్టైల్ .. అన్ని కోణాల్లోను అంబానీ రేంజుకు తగ్గడు. ఏ ఇతర స్టార్ హీరోతో పోల్చినా కింగ్ ఖాన్ షారూఖ్ అంబానీ రేంజు. షారుఖ్ ఖాన్ రూ. 6300 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశపు అత్యంత సంపన్న నటుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 స్టార్లలో షారూఖ్, సల్మాన్, అక్షయ్, అమీర్ ఖాన్, రజనీకాంత్, అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్, అజిత్, కమల్ హాసన్ ఉన్నారు.
భారతదేశ వినోదరంగంలో బాలీవుడ్ చాలా కాలం పాటు ఆధిపత్యం చెలాయించింది. అయితే బాహుబలి - RRR వంటి చిత్రాలతో దక్షిణ భారత సినిమా విజయం సౌత్ స్టార్ హీరోల పారితోషికాల ర్యాంక్‌లకు పెంచింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ వంటి స్టార్లను కలిగి ఉన్న ఫోర్బ్స్ జాబితా, బాలీవుడ్ -సౌత్ ఇండియన్ టాలెంట్ సమ్మేళనాన్ని ఆవిష్కరించింది.
భారతదేశ వినోదరంగంలో ముఖ్యంగా హిందీ మాట్లాడే ప్రేక్షకులలో బాలీవుడ్ ప్రముఖమైనది. అయితే బాహుబలి, RRR, పుష్ప, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల అద్భుతమైన విజయం దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని హైలైట్ చేసింది. ఈ చిత్రాలు విస్తృతమైన ప్రశంసలు పొందాయి. దక్షిణ భారత నటీనటులను పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేర్చాయి. వారి ర్యాంక్‌లను మెరుగుపరిచాయి. ఫోర్బ్స్, IMDb డేటాను ఉపయోగించుకుని ఇటీవల అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 10 భారతీయ నటీనటుల జాబితాను ప్రచురించింది. ఇందులోని ప్రతిభను హైలైట్ చేసింది.
బాలీవుడ్, దక్షిణ భారత సినిమాలు రెండూ జోడు గుర్రాలుగా ఉన్నాయి. జాబితాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గణనీయమైన మార్జిన్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, రజనీకాంత్ కూడా ఈ జాబితాలో టాప్ 10లో నిలిచారు. షారూఖ్ ఖాన్ సుమారుగా రూ. 6300 కోట్ల ఆస్తిపరుడు. ఇటీవలి హిట్‌లు జవాన్, పఠాన్ చిత్రాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాన్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. డుంకీ కూడా ఆశించిన విజయం అందుకుంది.
సల్మాన్ ఖాన్ సుమారు రూ. 2900 కోట్ల నికర ఆస్తి విలువతో రెండో స్థానంలో ఉన్నారు. భాయ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ అతడి తాజా చిత్రం టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ. 466.63 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది అతని శాశ్వత ప్రజాదరణను నొక్కి చెబుతుంది.
సుమారుగా రూ. 2500 కోట్ల నికర ఆస్తులతో అక్షయ్ కుమార్ టాప్ 3లో ఉన్నాడు. 2023లో బ్లాక్‌బస్టర్‌లను చూడనప్పటికీ వరస ఫ్లాపుల్లో ఉన్నా కానీ..ఆర్జన తగ్గలేదు. అమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ. 1862 కోట్లు. ఫిలింమేకింగ్ లో నటనలో అతడు మిస్టర్ పర్ఫక్షనిస్ట్. లాల్ సింగ్ చద్దా మంచి ప్రదర్శన ఇవ్వనప్పటికీ అతడు 2024లో సితారే జమీన్ పర్‌తో రేసులోకి వస్తున్నాడు. దంగల్, PK వంటి విజయాలను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు.
దళపతి విజయ్ సుమారు రూ. 474 కోట్ల నికర ఆస్తులు కలిగి ఉన్నాడు. విజయ్ నటించిన సినిమాలు వరుసగా రూ. 300 కోట్లు వసూలు చేస్తున్నాయి. వారిసు ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు .. లియో రూ. 612 కోట్లు వసూలు చేశాయి. లియో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా నిలిచింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ దక్షిణ భారతదేశంలో టాప్ 5 స్టార్లలో ఒకరిగా ఎప్పుడూ ఉన్నారు. ఇటీవలి బ్లాక్‌బస్టర్ జైలర్ తో రూ. 110 కోట్లు ఆర్జించారు. పరిశ్రమను దశాబ్ధాల పాటు ఏలిన రజనీ కాంత్ ఆస్తులు సుమారు 430 కోట్లు అని జాబితా వెల్లడించింది.
టాలీవుడ్ నుంచి ఇద్దరు..
అల్లు అర్జున్ సుమారుగా రూ. 350 కోట్ల (తండ్రి అల్లు అరవింద్ ఎంపైర్ ఆస్తులు కాకుండా) నికర ఆస్తులను కలిగి ఉన్నారు. `పుష్ప: ది రైజ్`లో పుష్పరాజ్ పాత్రతో అద్భుతాలు చేసిన బన్ని సీక్వెల్‌తో కొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. పుష్ప: ది రూల్ - పార్ట్ 2 విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రభాస్ నికర ఆస్తుల విలువ సుమారు రూ. 241 కోట్లు అని తెలుస్తోంది. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాడు. ఆదిపురుష్ ఆశించిన విజయం సాధించకపోయినా కానీ.. అతడు నటించిన తాజా చిత్రం `సలార్` దేశీయంగా రూ. 369.37 కోట్లు వసూలు చేసి.. రజనీకాంత్ జైలర్ కలెక్షన్లను అధిగమించింది.
తళా అజిత్ కుమార్ నికర ఆస్తుల విలువ రూ. 196 కోట్లు. 2023లో విడుదలైన తునివుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది భారతదేశంలో రూ. 130 కోట్లు వసూలు చేసింది. తదుపరి వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్న అజిత్ కొత్త సంచలనాలకు తెర తీయనున్నాడని టాక్ ఉంది.
సుమారు రూ. 150 కోట్ల నికర ఆస్తి విలువ తో కమల్ హాసన్ టాప్ 10లో నిలిచాడు. దాదాపు 220 సినిమాల కెరీర్‌లో ఎన్నో అద్బుత ప్రదర్శనలతో సంచలనాలు సృష్టించిన స్టార్ కమల్ హాసన్. మణిరత్నం దర్శకత్వం వహించిన అతడి తదుపరి ప్రాజెక్ట్ KH 234 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే కల్కి చిత్రంలోను కమల్ హాసన్ పాత్ర గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. అయితే టాప్ 10 జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు లేకపోవడం ఆశ్చర్యకరం. బహుశా చరణ్ ర్యాంక్ ఇంకాస్త పెద్దదిగా ఉండి ఉండొచ్చు.