కంగ‌న పెళ్లిపై మ‌న‌సులో మాట‌!

దీనిపై అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఈ వివాదం ఇప్ప‌టికీ కోర్టులో న‌డుస్తోంది.

Update: 2024-09-02 19:30 GMT

కంగ‌న ర‌నౌత్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? అస‌లు పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్న సందేహాలు చాలా కాలంగా తెర‌పైకి వ‌స్తున్నాయి. హృతిక్ రోష‌న్ తో రిలేష‌న్ చెడిన త‌ర్వాత కంగ‌న ఇంకెవ్వ‌రితోనూ ల‌వ్ లో ప‌డ‌లేదు. ఇది కూడా కంగ‌న నుంచి కేవ‌లం ఆరోపణ మాత్ర‌మే. ఇందులో వాస్త‌వం ఏంటో తెలియ‌ని ప‌రిస్థితి. దీనిపై అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఈ వివాదం ఇప్ప‌టికీ కోర్టులో న‌డుస్తోంది.

ఇలా జీవితంలో పోరాటాలు కంగ‌న‌కి కొత్తేం కాదు. న‌టిగా ప్ర‌యాణం మొద‌లైన నాటి నుంచి కంగ‌న వృత్తి, వ్య‌క్తిగ‌త విష‌యాల్లో పోరాటం చేస్తూనే ఉంది. ఈ మ‌ధ్య‌నే రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ త‌రుపున ఎంపీగా గెలిచి అక్క‌డా త‌న మార్క్ వేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇదంతా ఒకే. మ‌రి పెళ్లి సంగ‌తి ఏంటి? అంటే మాత్రం కంగ‌న కూడా దీనిపై క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతుంది.

`నాపై కేసులున్నాయి. ప్రతీకార, ప్ర‌తికూల ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ పెళ్లిపై మాత్రం చాలా అభిప్రా యాలున్నాయి. వాటి గురించి ఇప్ప‌ట్లో చెప్ప‌లేను` అంది. అలాగే పెళ్లి రాజ‌కీయ నాయ‌కుడిని చేసుకుం టారా? సినిమా న‌టుడితోనా? అంటే అది త‌న‌కి కూడా తెలియ‌ద‌నేసింది. ఇప్ప‌టికే కంగ‌న వ‌య‌సు 38 ఏళ్లు. న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా బాలీవుడ్ లో ఎంతో ఫేమ‌స్ అయింది.

కొన్నాళ్ల పాటు రాజ‌కీయాలు చేస్తుంది. ఇలా జీవితంలో రెండు ద‌శ‌ల్ని చూసింది. కానీ వ్య‌క్తిగ‌త జీవితంలో తోడు కోరుకుంటుందా? జీవితం సింగిల్ ? అన్న అంశంపై మాత్రం అస్ప‌ష్టంగానే కనిపిస్తుంది. ప్ర‌స్తుతం ఆమె న‌టించిన ఎమ‌ర్జెన్సీ రిలీజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. సెన్సార్ రిలీజ్ విష‌యంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News