మెగాస్టార్ 'గాడ్ ఫాద‌ర్' సీక్వెల్ చేస్తారా?

బాక్సాఫీస్ వ‌ద్ద‌ యావ‌రేజ్ గా ఆడి పెట్టుబ‌డుల్ని వెన‌క్కి తెచ్చింద‌ని టాక్ వ‌చ్చింది. జ‌యాప‌జ‌యాలతో ప‌ని లేకుండా మెగాస్టార్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.;

Update: 2025-03-16 06:33 GMT

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన రీమేక్ సినిమా 'గాడ్ ఫాద‌ర్'. ఇది 2019లో వచ్చిన మలయాళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'లూసిఫర్‌'కి అధికారిక‌ రీమేక్‌. ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించారు. సల్మాన్ ఖాన్ ఈ మూవీతో తెలుగులోకి ఆరంగేట్రం చేసారు. నయనతార, సత్య దేవ్, మురళీ శర్మ, తాన్య రవిచంద్రన్, సర్వదమన్ డి. బెనర్జీ, సముద్రకని, నవాబ్ షా, సునీల్ త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమా విడుద‌లై చాలా కాల‌మే అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద‌ యావ‌రేజ్ గా ఆడి పెట్టుబ‌డుల్ని వెన‌క్కి తెచ్చింద‌ని టాక్ వ‌చ్చింది. జ‌యాప‌జ‌యాలతో ప‌ని లేకుండా మెగాస్టార్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

అయితే మ‌ల‌యాళంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తుండ‌గా, చిరంజీవి కూడా గాడ్ ఫాద‌ర్ గా తిరిగి వ‌స్తారా? ఎల్.2 ఎంపురాన్ ని తెలుగులో రీమేక్ చేస్తారా? అన్న చ‌ర్చా సాగుతోంది. కానీ దీనిపై ఇప్ప‌టికి ఇంకా ఎలాంటి స్ప‌ష్ఠ‌తా లేదు. మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేసిన మలయాళ చిత్రం 'L2: ఎంపురాన్'కి పృథ్వీరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా అనుకున్నట్లుగా 27 మార్చి 2025న విడుదల కానుంది. ఆలస్యమ‌వుతుంద‌నే పుకార్లను తోసిపుచ్చుతూ మోహన్ లాల్ స్వ‌యంగా గోకులం మూవీస్ ద్వారా ఈ సినిమా పంపిణీని ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా, మురళీ గోపీ స్క్రిప్టు అందించారు.

సీక్వెల్ క‌థ కూడా నేటి ప్రపంచ నేపథ్యానికి వ్యతిరేకంగా స్టీఫెన్ నేడుంపల్లి అకా అబ్రహం ఖురేషి జీవిత‌ ప్రయాణాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. ఈ సినిమాను భార‌త‌దేశంలోని ప‌లు ప్రదేశాలలో, అలాగే విదేశీ లొకేష‌న్ల‌లోను చిత్రీకరించారు. లూసీఫ‌ర్ రీమేక్ లో న‌టించిన మెగాస్టార్ చిరంజీవి సీక్వెల్ లో కూడా న‌టిస్తారా? అన్న‌ది మ‌రోసారి చ‌ర్చ‌గా మారింది. చెన్నై, ముంబై, గుజరాత్, కేరళ, హైదరాబాద్, లేహ్‌ సహా పలు దేశాలలో ఈ సినిమాను చిత్రీక‌రించారు. అంత‌ర్జాతీయంగా సన్నివేశాలను అమెరికా, బ్రిట‌న్, యుఏఇలో చిత్రీకరించారు. దీపక్ దేవ్ సంగీతం అందించారు. ఈ సినిమాకి మూడో భాగం కూడా తెర‌కెక్క‌నుంది.

Tags:    

Similar News

2026 లోనే SSMB 29!