100 కోట్ల హీరోకి ఓపెనింగ్స్ లేవా?
దీని తర్వాత నిఖిల్ '18 పేజెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా అది కూడా హిట్ అయ్యింది.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన అందులో ఉన్న కంటెంట్, కృష్ణుడి ఎలివేషన్ తోనే నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. దీంతో సినిమాకి విపరీతమైన ఆదరణ వచ్చింది. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2’ అని చెప్పాలి.
దీని తర్వాత నిఖిల్ ‘18 పేజెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా అది కూడా హిట్ అయ్యింది. తరువాత ‘స్పై’ అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. కానీ కథ లోపం వల్ల పెద్దగా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో నిఖిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా నటించారు.
సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా, కనీసం ప్రమోషన్ కూడా లేకుండా మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’, ‘ది ఇండియన్ హౌస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి సెట్స్ పైన ఉండగానే మరో సినిమా ఎప్పుడు ఫినిష్ చేశాడా అని అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. ట్రైలర్ కొంత ప్రామిసింగ్ గానే అనిపించిన ఎందుకనో ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు.
జస్ట్ కొన్ని ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ సరిపెట్టారు. ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత నిర్మించారు. అయిన కూడా ఎందుకనో అగ్రెసివ్ గా మూవీ ప్రమోషన్స్ చేయలేదు. రిలీజ్ డేట్ కూడా సడెన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఇంటర్నల్ గా ఏమైందనేది ఎవరికి తెలియదు. కానీ ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. జస్ట్ ఛానల్స్ కి కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చారు.
ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమాకి అస్సలు ఓపెనింగ్స్ కూడా రాలేదని టాక్ వినిపిస్తోంది. నిజానికి నిఖిల్ కి 100 కోట్ల వరకు మార్కెట్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. ఆయన సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. అలాంటిది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఎంతో కొంత ప్రమోషన్ తో హడావుడి చేసి ఉంటే బజ్ పెరిగేది. నిఖిల్ రేంజ్ కు తగ్గట్టుగా ఓపెనింగ్స్ కూడా వచ్చేవి. మరి ఈ సినిమాని మేకర్స్ ఎందుకు సరిగా ప్రమోట్ చేయలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.