అయ్య‌ప్ప సోసైటీ కూడా ఒణుకుతుందా?

ఇందులో ఎవ‌రి నిజం? ఎవ‌రు అబ‌ద్దం? అన్న‌ది కోర్టులో తేలాల్సిన అంశం.

Update: 2024-08-25 05:39 GMT

`ఎన్ క‌న్వెన్ష‌న్` కూల్చివేత‌తో ఇండ‌స్ట్రీ స‌హా అంద‌రి గుండెల్లోనూ రైళ్లు ప‌రిగెడుతున్నాయా? నాగార్జున లాంటి స్టార్ ప్రాప‌ర్టీనే నేలమ‌ట్టం చేసిన హైడ్రా ముందు మేమంతా అన్న గుబులు మొద‌లైందా? అంటే అవున‌నే టాక్ ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌క్కెర్లు కొడుతుంది. ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చ‌డం అన్న‌ది అక్ర‌మం అని నాగార్జున వాద‌న కాగా, స‌క్ర‌మం అంటూ హైడ్రా వాదిస్తుంది. ఇందులో ఎవ‌రి నిజం? ఎవ‌రు అబ‌ద్దం? అన్న‌ది కోర్టులో తేలాల్సిన అంశం.

ప్ర‌స్తుతం తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన నేప‌థ్యంలో కూల్చివేత అక్క‌డితో ఆగింది. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీ స‌హా అయ్య‌ప్ప సోసైటీలో అపార్టు మెంట్లు..ప్లాట్ లు ఉన్న వాళ్ల గుండెల్లో గుబులు మొద‌లైంది. అయ్యప్ప సోసైటీలో చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌, న‌టుల‌కు ప్లాట్ లున్నాయి. ప్ర‌త్యేకంగా నిర్మాత‌ల సినిమా కార్యాల‌యాలు కూడా ఆ ప్రాంతంలో కోలువు దీరాయి. వీళ్ల‌తో పాటు చాలా మంది బ‌య‌ట వ్య‌క్తులు కూడా అయ్య ప్ప సోసైటీలో పెట్టుబ‌డులు పెట్టి ఉన్నారు.

అయితే హైడ్రా చ‌ర్య‌ల‌తో ఇప్పుడు స‌న్నివేశం మారిపోయింది. అంద‌రిలో ఇప్పుడు త‌మ ప్రొప‌ర్టీని ఎక్క‌డ కూల్చోస్తారో? అన్న టెన్ష‌న్ మొద‌లైంది. ఆ ప్రాంతంలో ఖ‌రీదైన అపార్ట్ మెంట్ లు, ల‌గ్జ‌రీ విల్లాలు కొలువు దీరి ఉన్నాయి. అక్క‌డ కార్పోరేట్ వ‌ర్గాల క‌న్ను ఎప్పుడో ప‌డింది. కాల‌క్ర‌మంలో సోసైటీ డెవ‌లప్ అవుతూ వ‌చ్చింది. మొన్న‌టివ‌ర‌కూ తెలంగాణ కేసీఆర్ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది.

ఆయ‌న గ‌ద్దెన‌కెక్కిన వెంట‌నే అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చేస్తాన‌ని హెచ్చ‌రించారు. అందులో ఎన్ క‌న్వెన్ష‌న్ తో పాటు, రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంది. కానీ ఆ త‌ర్వాత ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. తాజాగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో? సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే ర‌క‌మైన చ‌ర్య‌ల‌కు దిగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

Tags:    

Similar News