సార్ కి ఇంకా చరణ్ డేట్లు కావాలా?
తన పనులన్నింటిని ముగించుకుని బుచ్చిబాబు షూట్ కి హాజరయ్యే పనిలో నిమగ్నవుతున్నాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ పూర్తయింది. దీంతో చరణ్ బుచ్చి బాబు షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. తన పనులన్నింటిని ముగించుకుని బుచ్చిబాబు షూట్ కి హాజరయ్యే పనిలో నిమగ్నవుతున్నాడు. కానీ చరణ్ ని మాత్రం శంకర్ ఇంకా వదిలేలా కనిపించడం లేదు.
తాజాగా చరణ్ డేట్లు కావాలంటూ కొత్త పల్లవి అందుకున్నట్లు సమాచారం. తన పోర్షన్ అయిపోయినా? చరణ్ డేట్లు దేనికి అనుకుంటున్నారా? అయితే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఇటీవల రషెస్ చూసుకున్న శంకర్ ..చరణ్ సన్నివేశాలకు సంబంధించి ఇంకాస్త పర్పెక్షన్ కం ప్యాచ్ వర్క్ కోసం అదనంగా నాలుగైదు రోజులు డేట్లు కావాలంటున్నారుట. మరి ఈ సంగతి చరణ్ దృష్టికి వెళ్లిందా? లేదా? అన్నది తెలియదు గానీ నెట్టింట మాత్రం చర్చకు దారితీస్తోంది.
సంవత్సరాల పాటు ఈ సాగదీత ఏంటనే విమర్శలు మళ్లీ మొదలయ్యాయి. నాలుగు రోజులు డేట్లు ఇవ్వడం చరణ్ కి పెద్ద విషయం కాదు. సంవత్సరాల పాటు సావసం చేసిన చరణ్ నాలుగు రోజులు డేట్లు ఇస్తే అప్పటికైనా మొత్తం ముగుస్తుందా? లేదా? అన్నది సందేహాంగానే కనిపిస్తుంది. చరణ్ డేట్లు ఇస్తే కాంబినేషన్ ఆర్టిస్టులు కూడా మళ్లీ డేట్లు కేటాయించాలి. మళ్లీ అది నిర్మాతకు అదనపు భారం.
మరి ఈప్రచారంలో నిజమెంతో? నిజమే అయితే నిర్మాత దిల్ రాజు రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇప్పటికే చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు రాజుగారు ప్రకటించిన సంగతి తెలిసిందే. శంకర్ తో దిల్ రాజు ఎంతో ఇష్టపడి చేస్తోన్న సినిమా. అందుకే ఎంతో ఓపికగా పనిచేస్తున్నారు. అయినా ఒకానొక సమయంలో రాజు గారు సైతం రిలీజ్ కి వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే అన్న అసహానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.