ఆ హీరోకు ప్రభాస్ తలనొప్పిగా మారాడే..
యునానమస్ గా కల్కి 2898ఏడీ సినిమాకి ఆడియన్స్ వరల్డ్ వైడ్ గా భారీ సక్సెస్ ని అందించారు.
డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ ప్రభంజనం ముందు ఎవ్వరు నిలబడలేకపోయారు. నాలుగు వారల తర్వాత కూడా కల్కి 2898ఏడీ మూవీ హిందీలో మంచి బుకింగ్స్ తో కొనసాగుతోంది. సౌత్ లో ప్రస్తుతం ఒక్క రాయన్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దీంతో ప్రధాన నగరాలలో డార్లింగ్ సినిమాకి శని, ఆది వారాల్లో స్ట్రాంగ్ బుకింగ్స్ జరిగాయి. దీనిని బట్టి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు. యునానమస్ గా కల్కి 2898ఏడీ సినిమాకి ఆడియన్స్ వరల్డ్ వైడ్ గా భారీ సక్సెస్ ని అందించారు.
కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ అయిన రెండు వారల తర్వాత అక్షయ్ కుమార్ సర్ఫిరా చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. అయిన కూడా కల్కి సినిమా కారణంగా అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీకి అస్సలు ప్రేక్షకాదరణ లభించలేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా సర్ఫిరా సినిమాతో అక్షయ్ కుమార్ కమర్షియల్ ఫ్లాప్ ని సొంతం చేసుకున్నారు. దీనికి కారణం కల్కి మూవీ అని ట్రేడ్ పండితులు అంటున్న మాట.
ఇదిలా ఉంటే ఇప్పుడు అక్షయ్ కుమార్ కి మరోసారి ప్రభాస్ స్ట్రోక్ తగిలేలా ఉందనే మాట వినిపిస్తోంది. అక్షయ్ కుమార్ సూపర్ హిట్ సిరీస్ 'జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3' సినిమా ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫెస్టివల్ సెలవులు కూడా కలిసొస్తాయని ఆ డేట్ కి రిలీజ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న ది రాజాసాబ్ చిత్రాన్ని కూడా ఏప్రల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇది నిజంగా ఊహించని ఎనౌన్స్ మెంట్ అని చెప్పాలి. రెండు వారల గ్యాప్ తర్వాత వచ్చిన కూడా కల్కి సినిమా ఎఫెక్ట్ ని అక్షయ్ కుమార్ సర్ఫిరా తట్టుకోలేకపోయింది. అలాంటిది ఒకే రోజు రిలీజ్ అయితే జాలీ ఎల్ ఎల్ బి 3 సినిమా వైపు ప్రేక్షకులు చూసే అవకాశం కూడా ఉండదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ పరంగా చూసుకుంటే అక్షయ్ కుమార్ అతని సమీపంలో కూడా లేరు.
ఇలాంటి పరిస్థితిలో జాలీ ఎల్ ఎల్ బి 3ని వీలైతే రెండు, మూడు వారల ముందు రిలీజ్ చేసుకోవడం బెటర్ అనే మాట వినిపిస్తోంది. అలా కుదరకపోతే ది రాజాసాబ్ బజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ట్రేడ్ పండితులు సూచిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ ఇంపాక్ట్ షారుఖ్ ఖాన్ డంకీకి కూడా తప్పలేదు. ఇక అక్షయ్ కుమార్ తట్టుకోగలడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.