సేనాపతి - పురుషోత్తం - శివాజీ ఒకే సినిమాలో ఉంటే..!

ఈ మూడు సినిమాలు కూడా భారతీయ సమాజంపై కొంతలో కొంత అయినా ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు.

Update: 2024-06-29 06:01 GMT

సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో శంకర్ కి స్టార్‌ డైరెక్టర్ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన సినిమాలు భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ. ఈ మూడు సినిమాలు తమిళంలో రూపొందిన కూడా తెలుగు, హిందీ ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఈ మూడు సినిమాలు కూడా భారతీయ సమాజంపై కొంతలో కొంత అయినా ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు. దేశంలో ఉన్న అవినీతి కి వ్యతిరేకంగా రూపొందిన ఈ సినిమాల్లో హీరోల పాత్రలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. అందుకే ఈ మూడు సినిమాల హీరోలను ఒకే సినిమాలో చూపిస్తే బాగుంటుందని దర్శకుడు శంకర్‌ భావించాడట.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్‌ 2 సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. వచ్చే నెల రెండో వారంలో విడుదల కాబోతున్న భారతీయుడు 2 ప్రమోషన్ లో భాగంగా ఆ మూడు సినిమాల హీరోల పాత్రల కలయికలో ఒక సినిమా ను చేసే విషయమై చర్చ జరిగినట్లు శంకర్‌ తెలియజేశాడు.

2008 లో తాను సేనాపతి, పురుషోత్తం, శివాజీ పాత్రలతో ఒక కథను రాయాలి అనుకున్నాను. ఆ విషయాన్ని నా అసిస్టెంట్ కు చెప్పిన సమయంలో సరైన స్పందన రాలేదు. ఆ తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా ఈ విషయమై పాజిటివ్‌ రెస్పాన్స్ రాకపోవడంతో పక్కకు పెట్టాను అన్నారు.

భవిష్యత్తులో తప్పకుండా ఆ పాత్రలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. సేనాపతి ని మళ్లీ తీసుకు రాబోతున్న దర్శకుడు శంకర్‌ ముందు ముందు పురుషోత్తం మరియు శివాజీ లను కూడా శంకర్‌ తీసుకు వస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News