ఆ సినిమా ర‌ద్దు అయిందా?

ఆ విష‌యాన్ని కొర‌టాల‌గానీ...చ‌ర‌ణ్ గానీ ఎప్పుడూ మీడియా ముందుకు తీసుకురాలేదు.

Update: 2023-11-29 17:30 GMT

ప్రారంభమైన త‌ర్వాత సినిమాలు ర‌ద్దు అవ్వ‌డం అన్న‌ది చాలా రేర్ గా చోటు చేసుకుంటుంది. అంతా ఒకే అయిన త‌ర్వాత ఎక్క‌డో చిన్న పాటి తేడాలు రావ‌డంతో ఆగిపోతుంటాయి. రామ్ చ‌ర‌ణ్‌- కొర‌టాల శివ సినిమా అలా ఆగిపోయిందే. ఈసినిమా ఠెంకాయ కార్య‌క్ర‌మాలు ముగించి ఆపేసారు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందా? ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఆ విష‌యాన్ని కొర‌టాల‌గానీ...చ‌ర‌ణ్ గానీ ఎప్పుడూ మీడియా ముందుకు తీసుకురాలేదు.

ఆ ప్రాజెక్ట్ కి బ‌ధులుగా కొర‌టాల మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో చ‌ర‌ణ్ కూడా న‌టించారు. ఆగిపోయినా ఆ కాంబినేష‌న్స్ అన్న‌వి ఏదో రూపంలో భ‌ర్తీ అవుతుంటాయి. కొన్ని సినిమాలు అనుకుంటారు కానీ అవి ప‌ట్టాలెక్క‌వు. ఇలాంటివి చాలా సినిమాలుంటాయి. మీడియాకి తెలియ‌ని విష‌యాలు కాబ‌ట్టి వాటిపై ఎలాంటి చ‌ర్చ ఉండ‌దు. ఇక షూటింగ్ మొద‌లు పెట్టి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి.

కానీ ఇలాంటి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. తాజాగా ఆ జాబితాలో ఆస్టార్ హీరో-డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ చేరిపోయిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆ హీరో కెరీర్ లో ఆ జాన‌ర్ సినిమా ట‌చ్ చేయ‌డం తొలిసారి. ఆ సినిమా కోసం హీరో ప్ర‌త్యేకంగానూ స‌న్న‌ధం అయ్యాడు. స‌గం షూటింగ్ కూడా చేసారు. ఈ క్ర‌మంలోనే హీరో బిజీ షెడ్యూల్ కార‌ణంగా మ‌ధ్య‌లోనే బ్రేక్ ఇచ్చారు.

ఆ బ్రేక్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. కానీ ఇదే బ్రేక్ లో ఆ హీరో కొన్ని సినిమా షూటింగ్ ల‌కు హాజ‌ర వ్వ‌డం..ఆ సినిమాలు రిలీజ్ అవ్వ‌డం కూడా జ‌రిగింది. కానీ ముందు మొద‌లు పెట్టిన సినిమా మాత్రం ఇంత‌కీ తిరిగి ప్రారంభం కాలేదు. అయినా ఆ కాంబినేష‌న్ పై అంచ‌నాలు మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్పుడు కాక‌పోతే ..2024 లోనైనా పూర్తిచేస్తారు అని మీడియా లో సైతం క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో సినిమాపై కొన్ని నెగిటివ్ క‌థ‌నాలు కూడా తెరపైకి వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలోనూ మేక‌ర్స్ స‌హా హీరో కూడా స్పందించ‌లేదు. తాజాగా విశ్వ‌స‌నీయ స‌మాచారం ఏంటంటే? ఆ ప్రాజెక్ట్ ఆపేసార ని..ర‌ద్దు చేసార‌ని కొత్త వార్త ఒక‌టి తెర‌పైకి వ‌స్తుంది. అందుకు గ‌ల కార‌ణాలే ఏంటి? అన్న‌ది తెలియ‌దు గానీ ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభం కావ‌డం అన్న‌ది క‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఆ స్టార్ మేక‌ర్ 2024 లో కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారుట‌.

Tags:    

Similar News