ఓటీటీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. అలా అయితే గానీ!

అయితే ఎలాంటి సెన్సార్ రూల్స్ లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో తెరకెక్కిన వివిధ చిత్రాలు కూడా నేరుగా పలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

Update: 2024-06-11 16:30 GMT

కోవిడ్ ముందు వరకు ప్రతి వారం థియేటర్లలో సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఆ తర్వాత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రతి వీక్.. అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో అనేక చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీల్లో ఎక్స్ ట్రాగా వెబ్ సిరీసులు కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఎలాంటి సెన్సార్ రూల్స్ లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో తెరకెక్కిన వివిధ చిత్రాలు కూడా నేరుగా పలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

అయితే ఓటీటీలకు పెరిగిన డిమాండ్ తో ఆయా నిర్వాహకులు.. తమ స్ట్రీమింగ్ యూజర్స్ ను క్రమంగా పెంచుకుంటున్నారు. వరుస చిత్రాలను కొనుగోలు చేస్తూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను ప్రత్యేకంగా తెరకెక్కించి మరీ రిలీజ్ చేస్తున్నారు. వాటితో పాటు అనేక వెబ్ సిరీసులను రూపొందిస్తున్నారు. ఫస్ట్ సీజన్ హిట్ అయితే సీక్వెల్ సీజన్లు కూడా తీసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా తమ యూజర్లను పెంచుకుంటున్నారు.

ఇక ఓ సినిమా తెరకెక్కుతుండగానే.. ఆ మూవీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తున్నారు. వాటిని దక్కించుకునేందుకు మిగతా ఓటీటీలతో పోటీ పడుతున్నారు. పెద్ద మొత్తంలో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తున్నారు. కొన్ని సినిమాల విషయంలో కాస్త ఆలస్యం కూడా చేస్తున్నారు. మూవీ థియేటర్ లో రిలీజైన తర్వాత తమ సోషల్ మీడియాలో పోస్టర్లతో బజ్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఓటీటీ నిర్వాహకులు.. థియేటర్లలో రిలీజైన తర్వాత హక్కులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూవీ రిజల్ట్ బట్టి డీల్ కుదుర్చుకునేందుకు చూస్తున్నారు. ఇప్పుడు అన్ని సినిమాల విషయంలో ఇదే పంథాను ఫాలో అవ్వాలని అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా పరిస్థితిని చూశాకే హక్కులను కొనుగోలు చేయాలని ఫిక్స్ అయ్యాయట.

అంతేకాదు.. బాక్సాఫీస్ వద్ద ఏదైనా సినిమా నిరాశ పరిస్తే దాని హక్కులు కొనుగోలు చేయవని టాక్. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో నిరాశపరిచినా.. ఓటీటీలో మంచి వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. సినీ లవర్స్.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ఓటీటీల్లో అన్ని సినిమాలు కూడా చూసేందుకు మొగ్గు చూపుతుంటారు. మేకర్స్ కూడా దీని వల్ల లాస్ ఉంటుంది. మరి ఆ రెండు ఓటీటీలు.. సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News