ఫోటో స్టోరి: జూ. అతిలోక సుంద‌రి స‌మ్మోహ‌నం

మ‌రోవైపు జాన్వీ క‌పూర్ నిరంత‌ర ఫోటోషూట్లు వెబ్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

Update: 2025-02-10 04:06 GMT

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి జాన్వీక‌పూర్ ప్ర‌యాణం గురించి తెలిసిన‌దే. జాన్వీ సౌత్ లోను వేవ్స్ క్రియేట్ చేస్తోంది. కెరీర్ ఆరంభ‌మే టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం అందుకుంది. దేవ‌ర లాంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఘ‌న‌మైన ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మగ‌ధీర రామ్ చ‌ర‌ణ్ స‌ర‌సన క్రేజీగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాలో త‌న‌కు న‌టిగా నిరూపించుకునే ఆస్కారం బుచ్చిబాబు క‌ల్పించాడ‌ని టాక్ వినిపిస్తోంది. షూటింగుల కోసం జాన్వీ హైద‌రాబాద్ కి వ‌చ్చి వెళుతోంది. ఇటీవ‌ల ముంబై టు హైదరాబాద్ ప్ర‌యాణాలతో బిజీ బిజీగా ఉంది.


మ‌రోవైపు జాన్వీ క‌పూర్ నిరంత‌ర ఫోటోషూట్లు వెబ్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. యూత్ జాన్వీ ఫోటోల‌ను వాట్సాప్ లో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. ఇటీవ‌ల‌ జాన్వీ స్పెష‌ల్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. చూడ‌గానే మ‌త్స్య‌క‌న్య రూపంతో హృద‌యాల‌ను ట‌చ్ చేస్తోంద‌ని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఎంపిక చేసుకున్న సిల్వ‌ర్ లైనింగ్ మెటాలిక్ దుస్తుల్లో జాన్వీ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఫోటోషూట్ ఆద్యంతం మ‌త్తు క‌ళ్ల‌తో క‌వ్విస్తోంద‌ని పొగిడేస్తున్నారు బోయ్స్.


ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ని ఇన్‌స్టాలో షేర్ చేసిన జాన్వీ క‌పూర్ దానికి అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ``నేను ఈ విక్టోరియన్ దేశీని `ఆకతాయి అమ్మాయితో స‌మ్మ‌ర్` అని పిలుస్తాను` అంటూ క్యాప్ష‌న్ జోడించింది. ఒక అభిమాని జూ. అతిలోక సుంద‌రి స‌మ్మోహ‌నంలో ముంచేస్తోంది! అంటూ వ్యాఖ్య‌ను జోడించాడు


Tags:    

Similar News