గాంధీ..అంబేద్కర్ గురించి అదరగొట్టిన జాన్వీ!
కానీ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మాత్రం జాతిపిత మహత్మాగాంధీ. బి.ఆర్ అంబేద్కర్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది.
దేశ స్వాతంత్రద్యోమకారుల గురించి హీరోయిన్లు స్పందించడం చాలా తక్కువ. అలాంటి డిస్కషనే వాళ్ల మధ్య పెద్దగా ఉండదు కాబట్టి మాట్లాడేవారు కూడా తక్కువగానే ఉంటారు. కానీ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మాత్రం జాతిపిత మహత్మాగాంధీ. బి.ఆర్ అంబేద్కర్ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా అమ్మడు గాంధీ-అంబేద్కర్ మధ్య డిబేడ్ చూడటం ఆసక్తికరంగా ఉంటుందంది. ఒక నిర్ధిష్ట అంశంపై అంబేద్కర్-గాంధీ మధ్య అభిప్రాయాలు ఎలా రామాయి? అనే అంశంపై చర్చ చూడాలని ఉందని వ్యాఖ్యానించింది.
'సమాజం పట్ల..వారిద్దరు ఎంచుకున్న మార్గం పట్ల బలంగా నిలబడ్డారు. సమాజానికి ఎంతో సహాయం చేసారు. వారు ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో? తెలుసుకోవాలని ఉంది. ఇద్దరి మధ్య డిస్కషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందనిపిస్తుంది. కాలక్రమంలో వారి అభిప్రాయాలు ఎలా మారాయి? ఎందుకు మారాల్సి వచ్చింది? కుల ఆధారిత వివక్ష..అంటరానితనం పూర్తిగా అంతమవ్వాలి అనే అంబేద్కర్ వైఖరి స్పష్టంగా ఉంది. కానీ గాంధీ అభిప్రాయలు మారుతూ వచ్చాయి' అని అంది.
అలాగే చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడైనా కులతత్వం గురించి చర్చకు వచ్చిందా? అంటే! 'లేదు..స్కూల్లోనే కాదు. ఇంట్లో కూడా ఇలాంటి డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. కులం అనే టాపిక్ ఎప్పుడూ చర్చకు రాదు' అని అంది. జాన్వీ చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. జాన్వీ ఇంత తెలివైన పిల్ల అంటూ నెటి జనులు పొగిడేస్తున్నారు. దేశ భక్తులు ఫోటోలు చూపిస్తేనే ఎవరేంటో తెలుసుకోలేని కొంత మంది యువత ఉంది.
ఫోటోలు చూపిస్తే పేర్లు మార్చి చెబుతున్నారు. అలాంటిది జాన్వీ చేసిన వ్యాఖ్యలతో అమ్మడు తెలివైన నటిగానే తెలుస్తుంది. ఇక జాన్వీ కెరీర్ సంగతి తెలిసిందే. తెలుగు..హిందీలో దూసుకపోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 'దేవర'తో పాన్ ఇండియాలో మార్కెట్ లోకి అడుగు పెడుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆర్సీ 16 లోనూ ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.