జాన్వీ కపూర్ జెర్సీ నంబర్ 6
ఇప్పుడు స్టైలిష్ టాప్, ఫ్యాంట్ తో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శించింది. జాన్వీ పింక్ బ్రాలెట్ ధరించి అందంగా కనిపించింది.
జాన్వీ కపూర్ అరుదైన ఫ్యాషనిష్టా. ప్రతిసారీ వేదికలపై తనదైన ప్రత్యేకతను ప్రదర్శించడంలో వెనకాడదు. ఇప్పుడు తన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లోను జాన్వీ ఫ్యాషన్ సెన్స్ హాట్ టాపిక్ గా మారింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం కోసం జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవలే బ్లూ జెర్సీ ధరించి ఐపీఎల్ మ్యాచ్ లో కనిపించిన జాన్వీ ఇప్పుడు మహి జెర్సీ నంబర్ 6 అంటూ మరో వింతైన గెటప్ తో ప్రత్యక్షమైంది.
జాన్వీ స్టైలిష్ జెర్సీ - చారల స్కర్ట్ కాంబినేషన్ యూత్ కి కిక్కిస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్‌కాస్ట్ ఫ్యాషన్ గేమ్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ లుక్ నిజంగానే అభిమానుల్లోకి వైరల్ గా దూసుకుపోయింది. జాన్వీ కపూర్ తదుపరి మిస్టర్ అండ్ మిసెస్ మహిలో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించనుంది. క్రికెట్ నేపథ్య చిత్రం కోసం అదే రూపంతో జాన్వీ ప్రచారం చేస్తోంది.
ఇప్పుడు స్టైలిష్ టాప్, ఫ్యాంట్ తో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శించింది. జాన్వీ పింక్ బ్రాలెట్ ధరించి అందంగా కనిపించింది. జాన్వీ జెర్సీని బ్రాలెట్ లాగా ఎలా స్టైలింగ్ చేయగలిగింది? అన్నది ఆశ్చర్యపరుస్తోంది. దానిపై 6 నంబర్ ముద్రించి ఉంది. ఇది బహుశా తన పుట్టిన తేదీ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకుముందు, జాన్వీ ఎరుపు రంగు బాడీకాన్ దుస్తులను ధరించింది. ఇప్పుడు అందుకు భిన్నమైన రూపంతో ఆకట్టుకుంటోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవరలో నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు చిత్రంలోను నటించనుంది. దేవర సీక్వెల్లోను జాన్వీ కనిపిస్తుంది. మరోవైపు జాన్వీ పలు హిందీ ప్రాజెక్టులను పరిశీలిస్తోందని తెలిసింది.