ఆ విషయంలో తల్లిని గుర్తు చేస్తున్న జాన్వీ..

ఈ సందర్భంగా ఆదిల్ హుస్సేన్.. శ్రీదేవితో తాను కలిసి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమా చిత్రీకరణ సమయంలో కొన్ని సంఘటనలను తిరిగి గుర్తు చేసుకున్నారు.

Update: 2024-08-01 10:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అతిలోకసుందరిగా అందరి మన్ననలు అందుకున్న నటి శ్రీదేవి. ఈ దివంగత తార కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అప్పుడే చెర్రీతో రెండవ సినిమాకి లక్కీ ఛాన్స్ కూడా సంపాదించింది. కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాముఖ్యత ఇవ్వకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి జాన్వీ రెడీగా ఉంటుంది.

తాజాగా ఆమె నటించిన ఉలఝ్ చిత్రం రేపు విడుదల కాబోతోంది. సుధాంశు సరియా ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు వహించారు. గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్,అదిల్ హుస్సేన్ ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ప్రమోషన్ ఈవెంట్ లో అదిల్.. జాన్వీకపూర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆదిల్ హుస్సేన్.. శ్రీదేవితో తాను కలిసి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమా చిత్రీకరణ సమయంలో కొన్ని సంఘటనలను తిరిగి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో షూటింగ్ జరిగే సమయంలో శ్రీదేవితో కలిసి జాన్వీ సెట్స్ కు వచ్చేదట. అంటే సుమారు 13 సంవత్సరాల క్రితం ఆదిల్ జాన్వీ ను కలిశారు. అప్పుడు ఆమె వయసు సుమారు 14 సంవత్సరాలు.. తల్లితోపాటు షూటింగ్ కి వచ్చి ఎంతో జాగ్రత్తగా అన్ని గమనించేదట. బహుశా అందుకే ఆమె అంత అద్భుతంగా నటిస్తుందేమో అని ఆదిల్ అభిప్రాయపడ్డారు.

ఉలఝ్ షూటింగ్ సమయంలో జాన్వీ చూపించే డెడికేషన్, సిన్సియారిటీ చూసి తనకు ఆనాటి శ్రీదేవి గుర్తుకు వచ్చిందని ఆదిల్ పేర్కొన్నారు. డైరెక్టర్ ఎలా అయితే ఆశిస్తాడో అలా నటించడం, తాను చేయవలసిన సీన్స్ గురించి ముందుగానే అడిగి తెలుసుకోవడం, తోటి నటీనటులతో ఎంతో గౌరవంగా ఉండడం లాంటి ఎన్నో లక్షణాలు జాన్వీ ఆమె తల్లి నుంచి వారసత్వంగా పొందిందని ఆదిల్ పేర్కొన్నారు.

ఓ మంచి స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఉలఝ్ మూవీ లో జాన్వీ 'సుహానా భాటియా అనే ఐఎఫ్ఎస్ అధికారిణిగా కనిపించబోతోంది. వృత్తిపరంగా ఆమెపై తలెత్తిన ఎన్నో విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటూ తనపై పండిన కుట్ర నుంచి ఆమె ఎలా బయటికి వస్తుంది అనే ఆసక్తికరమైన కథనంతో ఈ మూవీ ముందుకు సాగుతుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు నగరాలలో ప్రీమియం షోలు పడ్డాయి. ఈ మూవీ లో జాన్వీ నటన అద్భుతంగా ఉందని.. తప్పక చూడాల్సిన సినిమా అని రివ్యూలు కూడా వచ్చాయి. రేపు విడుదల తర్వాత ఈ చిత్రం ఎంతవరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి.

Tags:    

Similar News