'దేవర'కి జాన్వీ ప్లస్సా? మైనస్సా?
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ టూ టాలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే.
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ టూ టాలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే. తెలుగులో `దేవర` సినిమాతో లాంచ్ అవుతుంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ అమ్మడు రెండవ ఛాన్స్ అందుకుంది. ఇలా అవకాశాల పరంగా జాన్వీ మార్క్ వేస్తోంది. చరణ్ సినిమా సంగతి పక్కనబెడితే? ..
`దేవర` సినిమాకి జాన్వీ కపూర్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అన్న అంశం ఇప్పుడు చర్చకొస్తుంది. అమ్మడి బాలీవుడ్ జర్నీని ఉద్దేశించి చూస్తే? పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది. జాన్వీ ఏడేళ్ల బాలీవుడ్ జర్నీ లో చేసింది ఎడు సినిమాలు. వాటిలో భారీ విజయాలు సాధించిన చిత్రాలే వైనా ఉన్నాయంటే పెద్దగా కనిపించే పరిస్థితి ఉండదు. డెబ్యూ `ధడక్` , `గుంజన్ సక్సెనా`, ` రుహీ`, `గుడ్ లక్ జెర్రీ`, `మిలీ`, `బవాల్`, `మిస్టర్ అండ్ మిస్టర్స్ మహి` లాంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
వీటిలో భారీ సౌండింగ్ హిట్ ఇచ్చిన సినిమాలేవి పెద్దగా ఉండవు. `ధడక్`, `బవాల్` లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడాయి. ఇలా వరుసగా అవకాశాలు రావడం వెనుక విమర్శలు మోస్తోంది. నెపోకిడ్ అనే విమర్శ అమ్మడిపై తొలి నుంచి ఉంది. బోనీ కపూర్, కరణ్ జోహార్ లాంటి వారు వెనుక ఉండటంటోనే అవకాశాలు వస్తున్నాయని విమర్శ ఎదుర్కుంటోంది. తాజాగా `దేవర` లో అవకాశం రావడం వెనుక మామ్ శ్రీదేవి ఇమేజ్ కారణం అన్న విమర్శ ప్రాజెక్ట్ కమిట్ అయిన దగ్గర నుంచి తెరపైకి వస్తోంది.
వెరసీ ఇవన్నీ దేవర కి మైనస్ గానే కనిపిస్తున్నాయి. జాన్వీ ఎంపిక అన్నది? ఆమెకున్న బాలీవుడ్ క్రేజ్ ఆధారంగా యూనిట్ ఎంపికచేసిందన్నది వాస్తవం. కానీ ఆమె నటించిన సినిమా ఫలితాలు చూస్తే ఏమంత గొప్పగా లేవు అన్నది నమ్మాల్సిన నిజం. అలాంటప్పుడు `దేవర`కి హిందీ మార్కెట్ అనేది కేవలం తారక్ ఇమేజ్ మీదనే ఆధారపడి ఉంటుంది? అని విశ్లేషకులు భావిస్తున్నారు. తారక్ ` ఆర్ ఆర్ ఆర్` విజయం..తాజాగా చేస్తోన్న హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తోన్న `వార్ -2` లాంటి చిత్రాల ఇమేజ్ తోనే `దేవర` నార్త్ బిజినెస్ ఆధారపడి ఉంటుందని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. మరి ఈ విమర్శల్ని జాన్వీ ఎలా తిప్పికొడుతుందన్నది చూడాలి.