జానీ మాస్టర్ కి జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ ఇవ్వొద్దు !
కోరియోగ్రాఫర్ జానీ మాష్టర్ పై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
కోరియోగ్రాఫర్ జానీ మాష్టర్ పై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ సహా తెలుగు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిత్ర పరిశ్రమ అతడిపై వేటు వేసిం ది. బాధిత మహిళకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పై నెటి జనులు భగ్గుమంటున్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ కేసులో జానీ భార్యపై కూడా ఆరోపణలు రావడం మరో సంచలనంగానూ మారింది. మతం మార్చుకోమని ఆమె నుంచి బాధిత మహిళలకు వేధింపులు ఎదురయ్యాయి? అంటూ కొత్త ఆరోపణ రావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డుకు అనర్హుడు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తమిళ చిత్రం `తిరు చిత్రంబలం` పాటలకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యాడు. మేఘం కరిగేనా సాంగ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకోనున్నాడు జానీ మాస్టర్. జానీతో పాటు సతీష్ కృష్ణన్ తో కలిసి జానీ మాస్టర్ ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది.
అయితే తాజాగా జానీపై వచ్చిన లైంగిక ఆరోపణలు కేసు విచారణ ముగిసే వరకూ అవార్డు అందుకో వడాన్ని ఆపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్ , తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేసారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అలాగే కేసు తేలే వరకూ జానీకి సినిమాల్లో అవకాశాలు కూడా కల్పించకూ డదని పేర్కొన్నారు.