షాకిస్తున్న స్టార్ రైట‌ర్ ఇద్ద‌రు భార్య‌ల బంధం

జావేద్ రెండవ భార్య షబానా అజ్మీతో తన సంబంధం ఎలా ఉందో కూడా మొద‌టి భార్య హ‌నీ ఇరానీ చెప్పారు.

Update: 2024-08-22 04:19 GMT

బాలీవుడ్ స్టార్ రైట‌ర్స్ స‌లీం-జావేద్ గురించిన చాలా విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వారి గురించి ఇటీవ‌ల‌ చాలా చర్చ సాగుతోంది. ప‌రిశ్ర‌మ‌ను శాసించిన ఈ దిగ్గ‌జ ర‌చ‌యిత‌ల‌పై డాక్యు సిరీస్ వారి జీవితాల్లోని చాలా విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. ఆ ఇద్ద‌రికీ ఇద్ద‌రు భార్య‌లు. మొద‌టి భార్య ఉండ‌గానే, వారు మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ్డారు. స‌లీం త‌న రెండో భార్య గురించి ఈ సిరీస్ లో వెల్ల‌డించారు. అలాగే జావేద్ కూడా త‌న రెండో భార్య‌తో త‌న మొదటి భార్య ఎలా ఉన్నారో తెలిపారు.

 

జావేద్ అక్తర్ మొదటి భార్య హనీ ఇరానీ ఏనాడూ అత‌డి రెండో భార్య స‌బానా ఆజ్మీతో గొడవ ప‌డ‌లేదు. ఆ ఇద్ద‌రూ మంచి స్నేహితులు అని తెలిపారు. అలాగే పిల్ల‌ల‌కు త‌న తండ్రి గారిపై అన‌వ‌స‌ర విష‌యాల్ని మొద‌టి భార్య‌కు అవ‌కాశం ఉన్నా కానీ నూరి పోయ‌లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ యాంగ్రీ యంగ్ మెన్‌లో ఇలాంటి అరుదైన విష‌యాల‌ను చ‌ర్చించారు. మూడు-భాగాల డాక్యు సిరీస్ సలీం-జావేద్ జీవితంలో అన్ని విష‌యాల‌ను ఆవిష్క‌రించింది. వారి ఉన్న‌తిని, ప‌త‌న స్థితిని కూడా ఈ సిరీస్ రివీల్ చేసింది.

 

వ్యక్తిగతంగా జావేద్ రెండు పెళ్లిళ్ల గురించి సిరీస్ లో చర్చించారు. జావేద్ తాను నేరాన్ని అనుభవిస్తున్నానని విఫలమైన వివాహానికి బాధ్యత వహించానని అంగీకరించగా, అతడి మొదటి భార్య హనీ ఇరానీ తన విధిని అంగీకరించింది. జావేద్ రెండవ భార్య షబానా అజ్మీతో తన సంబంధం ఎలా ఉందో కూడా మొద‌టి భార్య హ‌నీ ఇరానీ చెప్పారు. ఏం జ‌రిగినా కానీ మేం ఇప్పటికీ చాలా మంచి స్నేహితులం. నాకు అవసరమైనప్పుడు అతడు నా కోసం ఉంటాడని నాకు తెలుసు. అతడు ఏం చేసినా నేను అతని కోసం ఉంటానని అతడికి తెలుసు. పిల్లలు ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ ఉన్నారు. వారు పరిపూర్ణంగా ఉన్నారు. షబానా కూడా చాలా బాగుంది.. అని హనీ ఇరానీ అన్నారు.

కుటుంబ సభ్యులను బ్యాలెన్స్ చేసినందుకు హనీ గొప్ప‌త‌నాన్ని ప్ర‌శంసిస్తూనే జావేద్ రెండో భార్య ష‌బానా ఆమె గొప్ప‌తనాన్ని అంగీక‌రించారు . ''ముక్కోణ సంబంధం చాలా బాధాకరమైనది. ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు. ప్రజలు చాలా త్వరగా తీర్పునిస్తారు. ఆమె ఇంటిని విచ్ఛిన్నం చేసింది.. నాశనం చేసింది అనేస్తారు. ఇలాంటి దూష‌ణ‌ల‌తో ఇది మరింత బాధాకరంగా మారుతుంది! అని ష‌బానా చెప్పింది. షబానా తనను తాను వివరించడానికి ప్ర‌య‌త్నించ‌లేద‌ని అన్నారు. న‌న్ను నేను వివ‌రించాల‌నుకున్నా కానీ అలా చేయ‌ను. అలా చేస్తే నేను చాలా మంది వ్యక్తులను బాధపెడతాను. కాబట్టి తెలివితేటలు అంటే నిశ్శబ్దంగా ఉండటమే. నేను హనీకి గొప్ప క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే ఆమె నాకు వ్యతిరేకంగా చాలా కథలను చెప్పి పిల్లలను సులభంగా మార్చేయ‌గ‌లదు. ఆమె అలా చేయలేదు. మీరు ఆమెను చెడ్డ సవతి తల్లిగా చూడాల్సిన ప‌ని లేద‌ని పిల్ల‌ల‌కు నేర్పింది. ఆమెతో నాకు మంచి సంబంధం ఉంది'' అని ష‌బానా చెప్పింది.

ఇటీవ‌లి కాలంలో షబానా, హనీ తరచుగా కలిసి ఈవెంట్ల‌కు వెళుతున్నారు. వారు కొంతకాలం క్రితం ఫర్హాన్ అక్తర్‌తో కలిసి హాలిడే సెల‌బ్రేష‌న్స్ లో కనిపించారు. త‌న రెండో భార్య షిబానీ దండేకర్‌తో కలిసి ఫర్హాన్ వివాహానికి కూడా హాజరయ్యారు.

Tags:    

Similar News