'వార్‌ 2' కోసం ఎన్టీఆర్‌ వెళ్లేది ఎప్పుడంటే..!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఎన్టీఆర్‌ 'వార్‌ 2' సినిమాలో నటిస్తున్నాడు.

Update: 2024-10-05 07:30 GMT

ఎన్టీఆర్‌ హీరోగా రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. భారీ అంచనాల నడుమ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ ను దక్కించుకోవడంతో పాటు, మొదటి వారం రోజులు పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా ఏకంగా రూ.410 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అప్పుడే ఎదురు చూపులు మొదలు పెట్టారు. ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమా వార్‌ 2 తో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఎన్టీఆర్‌ 'వార్‌ 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ చేయని పాత్రను వార్‌ 2 లో అయాన్ ముఖర్జీ చేయిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వార్‌ 2 కోసం ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేసిన ఎన్టీఆర్‌ తదుపరి షెడ్యూల్‌ కోసం రెడీ అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ రెండో వారం నుంచి అంటే అక్టోబర్‌ 9వ తారీకు లేదా అటు ఇటుగా వార్‌ 2 షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ వార్‌ 2 కోసం ముంబై కి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది.

వార్ 2 సినిమా షూటింగ్‌ కి ఈ నెలలోనే ఎన్టీఆర్‌ హాజరు అవ్వబోతున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబోలో పాట చిత్రీకరణ జరపబోతున్నారు. ముంబై లోని ఒక స్టూడియోలో ఈ సినిమా పాటను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా అయాన్ ముఖర్జీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసే విధంగా భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా వార్‌ 2 ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి పెరుగుతూనే ఉంది.

ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ పూర్తి స్థాయి విలన్‌ పాత్రను చేసింది లేదు. జై లవకుశ లో మూడు పాత్రల్లో ఒక పాత్ర లో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఎన్టీఆర్‌ ఈసారి వార్‌ 2 లో పూర్తి స్థాయి నెగిటివ్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. నటన విషయంలో ఎన్టీఆర్‌ కి పోటీ ఇచ్చే వారు ఎవరూ ఉండరు. అలాంటి ఎన్టీఆర్‌ కి నెగటివ్‌ షేడ్స్ పాత్ర ఇస్తే ఏ స్థాయిలో దుమ్ము రేపుతాడో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్‌ వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా సైతం భారీ యాక్షన్ మూవీగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దేవర తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఎన్టీఆర్ తీసుకు రాబోతున్నాడు.

Tags:    

Similar News