సలార్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

పాన్ ఇండియా హీరో ప్రభాస్ - కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' మరో 48 గంటల్లో విడుదల కాబోతోంది

Update: 2023-12-21 02:45 GMT

పాన్ ఇండియా హీరో ప్రభాస్ - కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' మరో 48 గంటల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం సలార్ ఫస్ట్ డే సినిమా చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా సలార్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే కదా. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ట్రైలర్ లో ప్రభాస్ ఎలివేషన్స్, యాక్షన్, డైలాగ్స్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా చేయబోయేది ఎన్టీఆర్ తోనే కదా. సలార్ ఇలా ఉందంటే ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంటుందో అంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ తో తాను చేసేది తన డ్రీం ప్రాజెక్ట్ అని ప్రశాంత్ నీల్ ఇప్పటికే చెప్పడంతో ఈ సినిమాను మరింత కొత్తగా ప్లాన్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సలార్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఎన్టీఆర్ ప్రాజెక్టు పై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. సినిమాకి పోటీగా వస్తున్న షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాకు బుకింగ్స్ భారీ స్థాయిలో లేవు.

తెలుగు ఆడియన్స్ 'సలార్' పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో 'డంకీ' మూవీని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ .50 కోట్లకు పైగా కలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే ఊపు రిలీజ్ వరకు మెయింటెన్ అయితే ఖచ్చితంగా మొదటి రోజే వంద కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ సలార్ కి భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ 3 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.

రిలీజ్ కు ముందు సలార్ సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే ఖచ్చితంగా విడుదలయ్యాక ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరోవైపు వరుస అపజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ భారీ కం బ్యాక్ ఇస్తుందని అటు ఫ్యాన్స్ సైతం ఆశిస్తున్నారు. మరి రిలీజ్ తర్వాత సలార్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News