పక్షపాతంతో ముఖం లాగేసిన గాయకుడికి ఆర్థిక కష్టాలు
దీనివల్ల అతడు ఓ కష్టమైన నిర్ణయం తీసుకున్నాడు
డబ్బు జబ్బు ఎంత ప్రమాదమో.. డబ్బు సంపాదన లేని జబ్బు కూడా అంతే ప్రమాదం! ఇప్పుడు అలాంటి జబ్బుతోనే బాధపడుతున్నాడు ఈ గాయకుడు. అతడు ఎంత ఫేమస్సు అయినా.. డబ్బుల్లేక జేబు ఖాళీ అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. దీనివల్ల అతడు ఓ కష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా గాయకుడు? ఏమా కథ? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్ తన ఆరోగ్యం బాగాలేకపోయినా మళ్లీ టూర్ కు వెళ్లనున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటంటే అతడికి ఆదాయం సరిపోవడం లేదు. అతడు ఇప్పుడు తన ఖర్చులకు లేక, బిల్లులను చెల్లించడానికి కష్టపడుతున్నాడు. జస్టిన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మీడియా లో కథనాలొస్తున్నాయి.
అరుదైన `రామ్‌సే హంట్ సిండ్రోమ్`తో పోరాడుతున్న గాయకుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని కూడా చెబుతున్నారు. అలైన్‌మెంట్ కారణంగా అతని ముఖం సగం పక్షవాతానికి గురైంది. అతడు ఒక వైపు తన కన్ను రెప్ప వేయలేకపోతున్నాడు. వినికిడి ఇబ్బందులు.. మైకం సమస్యలు ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత జస్టిన్ 2023లో అనేక సంగీత పర్యటనలను రద్దు చేసుకున్నాడు. ఎందుకంటే అతడు పనిపై దృష్టిని కేంద్రీకరించలేకపోయాడు. ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.
అతడి మాజీ మెంటర్ డిడ్డీ కుంభకోణం వల్ల మొదలైన మానసిక క్షోభ అతడిని కుంగదీసింది. పాప్ స్టార్ బీబర్ తన విపరీత ఖర్చులతో కూడుకున్న జీవనశైలి కారణంగా డబ్బుల్లేక పర్యటనకు వెళ్ళవలసి వస్తోంది. అతడి మాజీ బృందం 300 మిలియన్ (సుమారు రూ.25.35 బిలియన్లు) డాలర్ల మేర తప్పుడు లెక్కలు చెప్పడంతో అది అతడిని పెద్ద దెబ్బ కొట్టింద. ఆ తర్వాత బీబీర్ 2023 నుండి పర్యటనల నుండి లాభం పొందలేదు. 2021 నుండి కొత్త ఆల్బమ్‌ను విడుదల చేయలేదు. ఇదేగాక జస్టిన్ బీబీర్ ఖర్చులు అతని ఆదాయాన్ని మించిపోయాయని కూడా తెలుస్తోంది.
ఈ ఇబ్బందుల కారణంగా తన ఆరోగ్యం బాగాలేకపోయినా మ్యూజిక్ టూర్ వెళ్ళవలసి వస్తుంది. సంపాదించడానికి జస్టిన్ పర్యటించాల్సి ఉంటుంది. అతడు 2021 నుండి కొత్త ఆల్బమ్ ని విడుదల చేయలేదు. అతడు విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నాడు. అతని అధిక ఖర్చు అలవాట్ల కారణంగా ఆర్థిక సమస్యల అంచున ఉన్నాడు అని తెలిసింది. 2021 ఆల్బమ్ జస్టిస్ విడుదల తర్వాత మరొక ఆల్బమ్ చేయలేదు. 2023 ప్రారంభంలో రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలిసాక `జస్టిస్ వరల్డ్ టూర్`ని రద్దు చేయవలసి వచ్చింది.