కాలాపాని వెబ్ సీరీస్ ఎలా ఉంది..?

కోవిడ్ లాక్ డౌన్ టైం లో ఓటీటీల మీద పడి తెగ సీరీస్ లు చూసేయడంతో సినిమాలకు ధీటుగా వెబ్ సీరీస్ లు సత్తా చాటుతున్నాయి.

Update: 2023-10-22 07:37 GMT

కోవిడ్ లాక్ డౌన్ టైం లో ఓటీటీల మీద పడి తెగ సీరీస్ లు చూసేయడంతో సినిమాలకు ధీటుగా వెబ్ సీరీస్ లు సత్తా చాటుతున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా కోట్ల కొద్దీ ఖర్చు పెట్టి మరి కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వెబ్ సీరీస్ లు కొన్ని ఉంటున్నాయని చెప్పొచ్చు. చెప్పే కథ చాలా పెద్దది అయినప్పుడు దాన్ని వెబ్ సీరీస్ గా చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఆడియన్స్ మైండ్ సెట్ ని ఫిక్స్ చేశారు.

ఓటీటీ వెబ్ సీరీస్ లో ఇప్పటికే చాలా సీరీస్ లు సూపర్ హిట్ కాగా కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో కాలాపాని కూడా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. సమీర్ సక్సేనా డైరెక్షన్ లో వచ్చిన ఈ వెబ్ సీరీస్ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. సోషల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీరీస్ ఏడు భాగాలుగా ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంది.

ఈ వెబ్ సీరీస్ కథ 2027 లో మొదలవుతుంది. అండమాన్ నికోబర్ దీవుల్లో డాక్టర్ గా పనిచేస్తున్న సౌదామిని (మోనా సింగ్) జ్వరంతో 11 మంది మరణించడంతో అచ్చం అలాంటి వైరస్ తో 1987 లో వందల సంఖ్యలో చనిపోయారని గుర్తిస్తుంది. జస్కిన్స్ లేక్ అనే వైరస్ తోనే వాళ్లు మరణించారని ఆమె కనిపెడుతుంది. అయితే అక్కడే న్యూ ఇయర్ పార్టీ జరుగుతుంది. ఆ టైం లో ఎంతోమంది అండమాన్ కు వస్తారు. వైరస్ ఆపేందుకు సౌదామినితో కలిసి మరో డాక్టర్ రీతూ (రాధిక మొహరోత్ర) ఏం చేశారు అన్నది వెబ్ సీరీస్ కథ.

సెరీస్ లెంగ్త్ కాస్త ఎక్కువ అయినప్పటికీ ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనం రాసుకున్నారు దర్శకుడు. వైరస్ కథలతో ఇదివరకు కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సీరీస్ హై బడ్జెట్ తో వచ్చింది. క్యాస్టింగ్ క్వాలిటీ కంటెంట్ అంతా చక్కగా కుదిరాయి. నేపథ్యం పాతదే అయినా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఆడియన్స్ ఎక్కడ కూడా బోర్ ఫీల్ కాకుండా సీరీస్ నడిపించారు. సోషల్ కాజ్ తో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ లో అన్ని బాగా వర్క్ అవుట్ అయ్యాయని చెప్పొచ్చు. సీరీస్ చూసిన వారంతా కూడా ఇంప్రెసివ్ అనేస్తున్నారు. ఈమధ్య కాలం లో వచ్చిన వెబ్ సీరీస్ లతో పోల్చితే కాలాపాని మంచి టాక్ సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News