పిక్‌టాక్‌ : కొడుకుతో చందమామ

పెళ్లి అయ్యి, కొడుకు పుట్టిన తర్వాత కూడా చందమామ లాంటి అందం కంటిన్యూ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా కాజల్‌ అగర్వాల్‌ తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది.

Update: 2024-12-19 00:30 GMT

టాలీవుడ్‌లో చందమామ బ్యూటీగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. కెరీర్‌ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్న కాజల్‌ అగర్వాల్‌ చందమామ, మగధీర సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన ఘనత కాజల్‌ అగర్వాల్‌కి దక్కింది. సీనియర్‌ హీరోలు అయిన చిరంజీవి తోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ద్వారా అనుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. మొదట కొడుకుతో హీరోయిన్‌గా చేసి, ఆ తర్వాత తండ్రితో హీరోయిన్‌గా చేసిన హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నిలిచింది.

కాజల్ అగర్వాల్‌ కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. 2020లో పెళ్లి చేసుకున్న కాజల్‌ అగర్వాల్‌ వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్‌ 2022 ఏప్రిల్‌లో కొడుకుకి జన్మనిచ్చింది. అతడికి నైల్‌ కిచ్లు అని పేరు పెట్టిన విషయం తెల్సిందే. పెళ్లి చేసుకున్న తర్వాత, బాబు పుట్టిన తర్వాత చందమామ సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్య కాలంలో కాజల్‌ అగర్వాల్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలో ఆమెకు సూపర్‌ హిట్‌ అయితే లభించడం లేదు.

పెళ్లి అయ్యి, కొడుకు పుట్టిన తర్వాత కూడా చందమామ లాంటి అందం కంటిన్యూ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా కాజల్‌ అగర్వాల్‌ తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. ఈసారి తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. టెన్నీస్ కోర్టులో నైల్‌ కిచ్లు చాలా ఆసక్తిగా ఆటను చూస్తున్న ఫోటోను కాజల్‌ అగర్వాల్‌ షేర్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముందు ముందు ఈమె తన కొడుకును టెన్నీస్ ప్లేయర్‌గా ఏమైనా మార్చాలని చూస్తుందా అంటూ ఈ ఫోటోకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

2007లో నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. మొదటి సినిమా కమర్షియల్‌గా తీవ్రంగా నిరాశ పరచింది. కానీ రెండో సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో చందమామ సినిమాను చేసింది. ఆ సినిమాతో మొత్తం సీన్‌ మారిపోయింది. ఒక్కసారిగా ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ పెరిగి పోయింది. కృష్ణవంశీ అద్భుతంగా ఆమెను చూపించడంతో పాటు నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ ఈమెకు స్టార్‌డం దక్కింది.

Tags:    

Similar News