కాజల్ కే కాదు వాళ్లకు కూడా అర్దం కాలే!
సినిమా నుంచి అమ్మడిని తొలగించారు. ఆమెపై కొన్నిసన్నివేశాలు కూడా చిత్రీకరించి సినిమా లో వాటి అవసరం లేకపోవడంతో వాటిని తొలగించారు.
చందమామ కాజల్ అగర్వాల్ 'ఇండియన్ -2'లో అవకాశం వచ్చేసరికి ఎగిరి గంతేసింది. ఈ సినిమా విజయం సాధిస్తే పాన్ ఇండియాలో గుర్తింపు దక్కుతుందని ఎంతో సంతోషపడింది. కమల్ హాసన్-శంకర్ లాంటి దిగ్గజాలతో పని చేస్తే తన కెరీర్ కే ప్రత్యేకమైన గౌరవం దక్కుతుందని ఎంతో ఆశపడింది. కానీ చివరికి ఏమైందో తెలిసిందే. సినిమా నుంచి అమ్మడిని తొలగించారు. ఆమెపై కొన్నిసన్నివేశాలు కూడా చిత్రీకరించి సినిమా లో వాటి అవసరం లేకపోవడంతో వాటిని తొలగించారు.
అలా కాజల్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై కాజల్ నిరుత్సాహాన్ని కూడా వ్యక్తం చేసింది. అసలు సినిమాకి తనని ఎందుకు ఎంపిక చేసారో? షూట్ చేసిన తర్వాత తనపై సన్నివేశాలు ఎందకు తొలగించారో తనకే అర్దం కాలేదు అంది. నిజమే ఈ సంగతి కాజల్ కే కాదు. చిత్ర యూనిట్ కి కూడా అర్దం కాలేదు. అందుకే వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓ పెద్ద ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అంటే? అంతా పక్కాగా ఉంటుంది.
నటీనటుల విషయంలో మార్పులు చేర్పులు వంటివి ఉండవు. అందులోనూ హీరోయిన్ స్థాయిలో ఎంపిక చేసినప్పుడు వాళ్లను తొలగించడం అన్నది జరగదు. కానీ 'ఇండియన్ -2' తో కాజల్ కి మాత్రం భంగపాటు తప్పలేదు. ఇంతవరకూ కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి సన్నివేశం ఎదురవ్వలేదు. ఎన్నో సినిమాలు చేసింది. ఎంతో మంది దర్శక, హీరోలతో కలిసి పనిచేసింది. కానీ సినిమా నుంచి తీసేసేంత పరిస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదు.
అయితే కాజల్ ని కేవలం రెండవ భాగం నుంచి మాత్రమే తొలగించారు. 'భారతీయుడు-3' లో కచ్చితంగా ఉంటుందని అంటున్నాయి చిత్ర వర్గాలు. మరి కాజల్ పై చిత్రీకరించిన ఆ సన్నివేశాలు మూడవ భాగంలో పెడుతున్నారా? లేక ఈ సన్నివేశాలు అక్కడ అవసరం పడటంతో ఇప్పుడు హైడ్ చేస్తున్నారా? ఈ రెండు గాక అక్కడ మళ్లీ ఫ్రెష్ గా షూటింగ్ చేస్తారా? అన్నది తేలాల్సిన అంశం.