కాజల్ అగర్వాల్.. ఆకలి తీర్చుకునేలా..

కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందు వరకు రెగ్యులర్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా కనిపికచేది.

Update: 2024-06-10 10:30 GMT

కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందు వరకు రెగ్యులర్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా కనిపికచేది. కానీ.పెళ్లి అనంతరం ఆమె ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఆదాయంతో సంబంధం లేదు కాబట్టి.. ఇక నటిగా మరింత ఆకలి తీర్చుకునేలా కథలను సెర్చ్ చేస్తోంది. ఇప్పటివరకు పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ గా వావ్ అనే రేంజ్ లో హైలెట్ కాలేదు. కాబట్టి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పవర్ఫుల్ కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటోంది.

కొడుకు పుట్టిన అనంతరం ఆమె గ్లామరస్ ఆఫర్స్ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక పవర్ఫుల్ లేడి ఓరియెంటెడ్ ఆఫర్స్ వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సత్యభామ' గత వారం విడుదలైంది. కానీ, రెండవ భాగంలో ఉన్న కన్‌ఫ్యూజింగ్ సీన్ల వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక కాజల్ కూడా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

విద్యాబాలన్, నయనతార వంటి హీరోయిన్లు తమ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో భారీ విజయాలు సాధించినప్పటికీ, ఇటీవల సమంత, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లు తీసుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆడకపోయాయి. ఉదాహరణకు, సమంత 'యశోద', కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ హీరోయిన్లు 'ఓ బేబీ', 'మహానటి' వంటి విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ, ఆ చిత్రాల విజయానికి దర్శకులే ప్రధాన కారణం అని చెప్పాలి. ఈ సినిమాల కోసం హీరోయిన్లను చాలా ప్రమోట్ చేసినప్పటికీ, వారి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, చందిని చౌదరి, పాయల్ రాజ్‌పుత్, అనసూయ వంటి చాలా హీరోయిన్లు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు. కానీ మంగళవారం వంటి విభిన్నమైన కాన్సెప్ట్స్‌తో వచ్చిన సినిమాలను మినహాయిస్తే, వేరే చిత్రాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద పనిచేయడం లేదు.

ఇలాంటి చిత్రాలు ఎప్పుడు విజయం సాధిస్తాయనే దానిపై సినీ వర్గాల్లో చాలా చర్చ జరుగుతోంది. ప్రముఖ హీరోయిన్లు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను ఎంచుకోవాలి అంటే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండాలి. ఫీమేల్ సెంట్రిక్ సినిమాల విజయానికి కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, బలమైన కథ, మంచి దర్శకత్వం కూడా అవసరం. ఈ నేపథ్యంలో, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తేనే రాబోయే రోజుల్లో హీరోయిన్స్ కు అవకాశాలు పెరుగుతాయి. మరి కాజల్ అలాగే మిగతా నటీమణులు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

Tags:    

Similar News