కల్కి 2898AD: ఆ స్టార్స్ కిక్కు ఎలా ఉంటుందో..

అయితే నాగ్ అశ్విన్ టీమ్ మూవీ ప్రమోషన్స్ ని చాలా అగ్రెసివ్ గా చేస్తోన్న వీరి గురించి మాత్రం ఎక్కడా రివీల్ చేయడం లేదు.

Update: 2024-06-21 13:30 GMT

సినిమాలలో కొంత మంది యాక్టర్స్ చేసిన కీలక పాత్రలు స్ట్రాటజీలో భాగంగా థియేటర్స్ లో ప్రేక్షకులకి సర్ ప్రైజ్ ఇవ్వాలని సీక్రెట్ మెయింటేన్ చేస్తారు. మూవీ ప్రమోషన్స్ చేసిన థియేటర్స్ లో సిల్వర్ స్క్రీన్ పై చూసేంత వరకు ఆ స్టార్ యాక్టర్ సినిమాలో నటించాడనే విషయం కూడా రివీల్ కాదు. అలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.

ముఖ్యంగా ఒక సినిమాలో స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ ని హైడ్ చేసి ఉంచడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తారు. కొంతమంది మాత్రం తమ సినిమాకి బూస్ట్ వస్తుందని భావించి స్టార్ హీరో మా సినిమాలో గెస్ట్ రోల్ చేశాడంటూ ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు కల్కి 2898ఏడీ మూవీ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో కొంత మంది స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేసారంట. వారిలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నాని పేరు కూడా వినిపించింది.

అలాగే డైరెక్టర్స్ రాజమౌళి, ఆర్జీవీ కూడా ఈ సినిమాలో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారంట. అయితే నాగ్ అశ్విన్ టీమ్ మూవీ ప్రమోషన్స్ ని చాలా అగ్రెసివ్ గా చేస్తోన్న వీరి గురించి మాత్రం ఎక్కడా రివీల్ చేయడం లేదు. కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా పూర్తిస్థాయిలో రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచారు. అయితే ఇలా సీక్రెట్ గా ఉంచి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నారంట.

తమ అభిమాన హీరోలు, దర్శకులు తెరపై కనిపించినప్పుడు ఫ్యాన్స్ థ్రిల్ గా ఫీల్ అవుతారు. అందుకే వారు చేసిన రోల్స్ గురించి ఎక్కడా రివీల్ చేయడం లేదనే మాట వినిపిస్తోంది. అలాగే చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ని కూడా నాగ్ అశ్విన్ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారంట. అవన్నీ ఆడియన్స్ తెరపై చూసినపుడు అద్భుతంగా ఫీల్ అవ్వాలనే అభిప్రాయంతో వాటిపై సస్పెన్స్ ని అలాగే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గెస్ట్ రోల్స్ చేస్తున్న స్టార్స్ ఎవరు? వారి క్యారెక్టర్స్ ఏంటి? ఆ కిక్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే.. సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News