.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి సీక్వెల్ పరిస్థితేంటి? ఎప్పుడు రావొచ్చు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే

Update: 2024-06-30 14:24 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. మూడు రోజులకు గాను రూ.400 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరనుంది. ప్రస్తుతం మేకర్స్ ఫుల్ జోష్ తో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ లాస్ట్ లో ఈ విషయాన్ని చెప్పగా.. రీసెంట్ గా నిర్మాత అశ్వనీదత్ పార్ట్-2 కోసం మరింత క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ కు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి చేశామని చెప్పి షాకిచ్చారు. దీంతో కల్కి పార్ట్-2 కోసం అంతా చర్చించుకుంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవ్వవచ్చోనని డిస్కస్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాదే వచ్చేస్తుందని అనుకుంటున్నారు.

కానీ అది అనుకున్నంత ఈజీ కాదని కొందరు సినీ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సీక్వెల్ కు సంబంధించి కీలక పార్ట్ ఇంకా పూర్తి అవ్వలేదు. కమల్ హాసన్ తన పాత్ర అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుందని తెలిపారు. అశ్వనీదత్.. ఏమో యాస్కిన్ రోల్ కు సంబంధించిన షూట్ పెండింగ్ ఉందని చెప్పారు. కాబట్టి కాస్త టైమ్ ఎక్కువే పడుతుంది. సినిమాలో మెయిన్ క్యాస్టింగ్ మధ్య మరిన్ని సీన్స్ కూడా తీయాల్సినవి ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిబట్టి చూస్తే.. కల్కి పార్ట్-2 షూటింగ్ పూర్తి కావడానికి ఏం లేదన్నా ఏడాది దాటి అవుతుంది. షూటింగ్ అయిపోతే సంబరం కాదు.. వీఎఫ్ ఎక్స్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ కు వచ్చిన రెస్పాన్స్ ను నాగ్ అశ్విన్ దృష్టిలో పెట్టుకుంటారు. తప్పొప్పులపై స్పెషల్ ఫోకస్ పెడతారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలా మరో రెండున్నరేళ్లు కచ్చితంగా పట్టొచ్చు. అంటే 2026 లోనే సినిమా రావొచ్చు!

Read more!

ఇక ప్రభాస్ సంగతి చూస్తే.. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మారుతి రాజా సాబ్ సెట్స్ పై ఉంది. వచ్చే సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం షూటింగ్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. పీరియాడిక్ మూవీని స్టార్ట్ చేసేందుకు హను రాఘవపూడి ఇప్పటికే సిద్ధమైపోయారు.

అలా ప్రభాస్ లైనప్ లో భారీ చిత్రాలే ఉన్నాయి. రాజా సాబ్ మాత్రమే ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటోంది. మిగతా చిత్రాల పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. కాబట్టి ప్రభాస్.. రాజా సాబ్ కాకుండా నెక్స్ట్ ఏ సినిమా ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు కల్కి సీక్వెల్ కోసం ప్రభాస్ ఈ ఏడాది డేట్స్ కేటాయించడం కష్టం. వచ్చే ఏడాదే సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో? కల్కి సీక్వెల్ ఎప్పుడొస్తుందో చూడాలి.

Tags:    

Similar News