కల్కి 2898 AD సీక్వెల్.. టైటిల్ ఇదైతే ఓకే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా విడుదలకు ముందు హైప్ పెంచడంలో కాస్త వెనుకబడినట్లు అనిపించింది.

Update: 2024-06-27 09:27 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా విడుదలకు ముందు హైప్ పెంచడంలో కాస్త వెనుకబడినట్లు అనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమైంది. రీసెంట్ గా దర్శకుడు, నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ప్రేక్షకులతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ లైవ్‌లో ప్రధానంగా చర్చనీయాంశమైనది కల్కి సీక్వెల్. ‘కల్కి 2898 AD’ విజయం సాధిస్తే, సీక్వెల్ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఇక సీక్వెల్ కోసం పలు టైటిల్స్‌ను అభిమానులు సూచించారు, అందులో ‘కల్కి 3102 BC’ అనే టైటిల్ పై ఆసక్తి ఎక్కువగా వుంది. ఈ టైటిల్ కు ఒక ప్రత్యేకమైన స్టోరీ ఏమోషన్ కూడా ఉంది.

ఈ టైటిల్ ప్రతిపాదించిన అభిమాని తన వివరణలో ఈ విధంగా తెలియజేస్తూ.. మహాభారతం ముగిసిన సంవత్సరం కృష్ణుడు మానవశరీరాన్ని వీడిన సంవత్సరం 3102 BC అని, అదే సమయంలో కలియుగం ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ టైటిల్ నాగ్ అశ్విన్‌ని ప్రత్యేకంగా ఆకట్టుకోవడం విశేషం. ఇక సీక్వెల్‌లో కల్కి పాత్రను మరో సారిగా ప్రభాస్ పోషించే అవకాశం ఉన్నట్లు ఆయన సూచనల ద్వారా తెలుస్తోంది.

కృష్ణుడు మానవ అవతారం వీడి కలియుగం ప్రారంభమైన కాలానికి కల్కి సీక్వెల్ కథను ముడిపెడితే, అది ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించగలదని భావిస్తున్నారు. అందుకే ఇదే టైటిల్ పర్ఫెక్ట్ అని అభిమానులు కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు, సినిమా ప్రేమికులు సోషల్ మీడియాలో ఈ సమాచారాన్ని వైరల్ చేస్తూ, తదుపరి సీక్వెల్ గురించి చర్చిస్తున్నారు.

మరికొంత మంది సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 AD విడుదలైన కొన్ని గంటలకే ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. సినిమా విజువల్స్, కథనం, నటనతో మన్ననలు పొందుతోంది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరొక భారీ హిట్‌గా నిలిచే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ, మేకింగ్ లో ఉన్న నైపుణ్యం, కథనంలో ఉన్న సాంకేతిక నైపుణ్యాలు కలిపి కల్కి 2898 AD ను ఒక బిగ్ మూవీగా తీర్చిదిద్దాయి.

ఇక, సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఉంటుందో అన్నదాని గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద, కల్కి 2898 AD విజయం నేపథ్యంలో కల్కి సీక్వెల్ కథనం, టైటిల్ పై చర్చ జరగడంతో ఆ హైప్ మరింత పెరిగింది. ‘కల్కి 3102 BC’ టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కితే, అది ప్రభాస్ కెరీర్‌లో మరింత ప్రాధాన్యతను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. మరి డైరెక్టర్ ఏ విదంగా ఆలోచిస్తారో చూడాలి.

Tags:    

Similar News