ప్రభాస్.. ఓటీటీ డోస్ పెంచుతాడా?

అయితే కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అందరూ వెయిట్ చేయగా.. ఆ సమయం రానే వచ్చేసింది.

Update: 2024-08-24 03:15 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి మూవీ.. థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. సెన్సేషనల్ హిట్ అయ్యి ఎన్నో రికార్డులు సృష్టించింది. అయితే కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అందరూ వెయిట్ చేయగా.. ఆ సమయం రానే వచ్చేసింది.

నిన్న (ఆగస్టు 22వ తేదీన) అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ ఫ్లిక్స్ లలోకి ఎంట్రీ ఇచ్చింది కల్కి మూవీ. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ అవుతుండగా.. నెట్‌ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్ లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో 5వ స్థానంలో అడుగుపెట్టింది కల్కి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే టాప్ 1 ప్లేస్ కు దూసుకెళ్లింది. దీంతో థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా కల్కి అదరగొడుతుందనడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ఈ ఏడాదిలో ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పుడు కల్కి రాగా.. 2024 స్టార్టింగ్ లో సలార్ ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ ను ప్రేక్షకులు పదే పదే చూసినట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ సీక్వెన్స్ కు ఫిదా అయిన మాస్ లవర్స్.. మళ్లీ మళ్లీ చూశారట. దీంతో సలార్ కు భారీ వ్యూస్ వచ్చినట్లు సమాచారం.

ఓటీటీ విడుదల తర్వాత చాలా కాలం పాటు సలార్ యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ కూడా వైరల్ అయ్యాయి. మరి కల్కి విషయంలో అదే సీన్ రిపీట్ అవుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో అలాంటి రిపీటెడ్ ఎలిమింట్స్ ఉన్నాయని అని మాట్లాడుకుంటున్నారు. అయితే కల్కి క్లైమాక్స్ పోర్షన్ మాత్రమే కచ్చితంగా రిపీటెడ్ మోడ్ లో చూస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కల్కి ట్రిమ్ వెర్షన్ ను ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ఆరు నిమిషాల మూవీ రన్ టైమ్ ను తగ్గించారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న సినిమా.. ఓటీటీలోకి వచ్చే సరికి 175 నిమిషాలకు చేరింది. అయితే ప్రస్తుతానికి సైలెంట్ గా స్ట్రీమ్ అవుతూనే టాప్ ప్లేస్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా బిట్స్ వైరల్ అయినట్లు కనిపించడం లేదు. చూడాలి మరి సలార్ సీన్ ను కల్కి రిపీట్ చేస్తుందో లేదో.

Tags:    

Similar News