ప్రభాస్ కల్కి.. 12వ రోజు ఇలా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-09 06:46 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. రెండో వారంలో కూడా సత్తా చాటుతోంది. అనేక రికార్డులు బద్దలుగొడుతూ మరెన్నో కొత్తవి క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ మూవీ వసూళ్ల వర్షం చూస్తుంటే.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాల్లో కల్కి నిలిచేటట్లు కనిపిస్తుంది.

ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకోవడం, ఆ తర్వాత ఎలాంటి పోటీ లేకపోవడంతో నేషనల్ లెవెల్ లో కల్కి సినిమా ఆకట్టుకునే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ వీక్ లోనే రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన కల్కి.. రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరుకునే దిశగా వెళుతోంది. 11 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కల్కి.. రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే 12వ రోజు కల్కి సినిమా రూ.11.35 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. నిన్న (సోమవారం) కల్కి హిందీ వెర్షన్ రూ.6.5 కోట్లు రాబట్టగా, తెలుగు వెర్షన్ రూ.4 కోట్లు వసూలు చేసింది. తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు వరుసగా రూ. 70 లక్షలు, రూ. 15 లక్షలు, రూ.50 లక్షలు సాధించాయి. దీంతో కల్కి సినిమా ఇప్పటి వరకు ఇండియాలో రూ.520 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

అమెరికాలో 16 మిలియన్ డాలర్స్ పైగా కల్కి కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీలో ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కల్కి మూవీ. మొత్తానికి మొదటి రోజు రూ.191 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కల్కి మూవీ.. ఇప్పటికీ అన్ని చోట్ల కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. రిలీజైన అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లో దూసుకుపోతోంది. మేకర్స్ కు ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా లాభాలు తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది.

సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో కల్కి సినిమాను నిర్మించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఆ మూవీకి థియేట్రికల్ బిజినెస్ రూ.370 కోట్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే రూ.380 కోట్లు వస్తే మూవీ క్లీన్ హిట్. కానీ కల్కికి ఇప్పటికే రూ.450 కోట్ల షేర్ వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్ లో ఎప్పుడు చేరుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News