కల్కి2898 ఏడీ.. మల్టీప్లెక్స్ లలో ఊర మాస్ సౌండ్

వరల్డ్ వైడ్ గా 200+ కోట్ల వరకు కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Update: 2024-06-28 06:24 GMT

 టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీగా వచ్చిన కల్కి 2898ఏడీ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో అయితే చాలా షోలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హౌస్ ఫుల్ అయిపోయాయి. ఒక్క రోజులోనే నార్త్ అమెరికాలో 5.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి మూవీ కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ గా 200+ కోట్ల వరకు కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఫస్ట్ డే కల్కి 2898ఏడీ మూవీకి పబ్లిక్ నుంచి బాగుందనే టాక్ రావడంతో ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్స్ పెరిగినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి. ఈ మూడు రోజుల పాటు కల్కి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 3డీలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విజువలైజేషన్ పరంగా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు మూవీకి బాగా కనెక్ట్ అయిపోయారు.

స్టోరీ ప్లాట్ అందరికి తెలిసిందే అయిన నాగ్ అశ్విన్ దానిని చెప్పిన విధానం కొత్తగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అప్సర సినిమాస్ లో మొదటి రోజు కల్కి మూవీ 42కి 42 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయంట. టోటల్ గా 7248 టికెట్లు ఫస్ట్ డే అమ్ముడయ్యాయని పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

బుక్ మై షోలో అవుట్ ఆఫ్ 10కి 9.3 రేటింగ్ తో కల్కి మూవీ కొనసాగుతోంది. అలాగే బుకింగ్స్ పరంగా టాప్ ట్రెండింగ్ లో ఉంది. అత్యంత వేగంగా టికెట్ బుకింగ్స్ జరుగుతున్న సినిమాగా కల్కి మూవీ టాప్ లో బుక్ మై షో యాప్ లో ఉంది. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరల్ని లెక్కచేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాని చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

పెద్దలకి కావాల్సిన మైథాలజీ ఎలిమెంట్స్, యూత్ కి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్, పిల్లలకి కావాల్సిన గ్రాఫిక్స్ మాయాజాలం కల్కి 2898ఏడీలో ఉన్నాయి. ఈ కారణంగానే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News