`క‌ల్కీ 2898` బుకింగ్ పేరిట భారీ దోప‌డి!

పాన్ ఇండియా చిత్రం `కల్కి 2898` టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఎక్క‌డా చూసినా హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

Update: 2024-06-25 06:50 GMT

పాన్ ఇండియా చిత్రం `కల్కి 2898` టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఎక్క‌డా చూసినా హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. దేశ‌వ్యాప్తంగా అన్ని థియేట‌ర్ల‌ల‌లో ఇదే జోరు క‌నిపిస్తుంది. సోమవారం రాత్రి 11:15 గంటలకు టాప్ 3 నేషనల్ చైన్‌లు పీవీఆర్ ఐనాక్స్ , సినీ పోలీస్ లో 29,500 టిక్కెట్లు అమ్ముడ య్యాయి. ఐవీఆర్ ఐనాక్స్ లో 22,300 టిక్కెట్లను విక్రయించగా, సినీపోలిస్ 7,200 టిక్కెట్లను విక్రయిం చింది.

నార్త్ లో సినిమాని అనిల్ త‌డానికి కి చెందిన ఏఏ సంస్థ మొత్తం 3500 స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తుంది. హిందీ వెర్షన్ ముందస్తు బుకింగ్‌లు ఆదివారం రాత్రి ప్రార‌భం కావ‌డంతో ఊహించిన దానికంటే మెరుగైన స్పందన వచ్చింది. బీహార్‌లోని సంజయ్ సినీప్లెక్స్‌లో 12 గంటలలోపే 300 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గురువారం భారత్‌తో జరిగే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ సాయంత్రం - రాత్రి ప్రదర్శన సంఖ్యలను ప్రభావితం చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇలా నార్త్ లో క‌ల్కీ జోరు భారీగా క‌నిపిస్తోంది. అయితే ముంబైలోని ప్రసిద్ధ గైటీ-గెలాక్సీ - మరాఠా మందిర్‌ను నిర్వహిస్తున్న థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ కి మాత్రం చేదు అనుభ‌వం ఎదురైంది. తన థియేటర్లలో టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభించేందుకు డిస్ట్రిబ్యూటర్లు అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. పంపిణీదారులు ముందస్తు బుకింగ్‌లను తెరవడం లేదు. కేవ‌లం 3డీ షోల‌కు మాత్ర‌మే బుకింగ్స్ తెరిచార‌న్నారు.

రిలీజ్ కి ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉన్నా ఇంత‌వ‌ర‌కూ తెర‌వ‌క‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీని గురించి ప్ర‌భాస్ స్నేహితుల తోనూ మాట్లాడిన‌ట్లు చెప్పారు. త‌న థియేట‌ర్ల‌లో టికెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌టంతో మ‌ల్టీప్లెక్స్ నుంచి ఎక్కువ లాభాలు పొందొచ్చ‌ని పంపిణీదారులంతా ఈ దుశ్చ‌ర్య‌కి దిగార‌ని మండిప‌డ్డారు. ఇది అతి పెద్ద భారీ దోపీడీగా క‌నిపిస్తుంది. సింగిల్ స్క్రీన్ల‌కు ఇది భారంగా మారింద‌న్నారు. ప్రభాస్ గ త సినిమా `స‌లార్` రిలీజ్ లోనూ ఇదే ప‌రిస్థితి ఎదురైంద‌ని ఆవేద‌న చెందారు.

Tags:    

Similar News