NKR21 గ్లింప్స్.. కళ్యాణ్ రామ్ మరో హై వోల్టేజ్ కాన్సెప్ట్

నందమూరి కళ్యాణ్ రామ్.. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్టులతో సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

Update: 2024-05-28 04:12 GMT

నందమూరి కళ్యాణ్ రామ్.. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్టులతో సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. బింబిసార సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. తన 21వ చిత్రం కోసం ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది.


నేడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ను రివీల్ చేశారు. "ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేం" అని పేరొందిన ఈ గ్లింప్స్, కళ్యాణ్ రామ్ పాత్ర శక్తివంతమైన దృశ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ మరియు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. "సరిలేరు నీకెవ్వరు" చిత్రం తరువాత ఆమె ఈ సినిమాలో నటించడం విశేషం. ఆమె పాత్ర, కర్తవ్యం క్యారెక్టర్ తరహాలో శక్తివంతమైనదిగా ఉండబోతోందని సమాచారం. అలాగే సోహెల్ ఖాన్, సాయీ మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్స్ టీం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ రామ్ ప్రసాద్, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ టీజర్‌లోనే తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎడిటర్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే రచయిత శ్రీకాంత్ విస్సా వంటి వారు ఈ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ లుక్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని మార్క్ కి తగ్గట్టుగా మరోసారి క్యారెక్టర్ ఉండనున్నట్లు చెబుతున్నారు. గ్లింప్స్ లో చూపించిన విధంగా, కళ్యాణ్ రామ్ పాత్ర దృఢంగా ఉండబోతోంది. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతుందని మేకర్స్ చెబుతున్నారు.

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విడుదల చేసిన ఈ గ్లింప్స్, అభిమానులకు పండగలా మారింది. చిత్ర నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బాలుసు ఈ సినిమాను అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా ఎన్నో విషయాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. బిగ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల డేట్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News