పార్ట్ 3పై లీక్ ఇచ్చిన లోక నాయకుడు

ఇది ఏమైనా ఇండియన్ 2 మూవీకి వచ్చే సక్సెస్ బట్టి ఇండియన్ 3 సినిమాపై పబ్లిక్ లో ఒక హైప్ క్రియేట్ అవుతుంది.

Update: 2024-07-03 10:05 GMT

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా కల్కి సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించారు. ఈ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. కల్కి పార్ట్ 2లో అతని పాత్ర చాలా బలంగా ఉండబోతోందని అర్ధమవుతోంది. అసలు సుప్రీమ్ యాస్కిన్ కల్కి పుట్టుకని ఎలా ఆపగలడు అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించిన భారతీయుడు 2 జులై 12న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాను భారతీయుడు 2 ఒప్పుకోవడానికి కారణం నెక్స్ట్ వచ్చే భారతీయుడు 3 అని చెప్పారు. అందులో క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఇండియన్ 3 మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఈవెంట్ లో కమల్ హాసన్ చెప్పడం విశేషం.

నిజానికి మొదటి నుంచి ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుందని, సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ చుట్టూనే స్టోరీ నడుస్తుందనే ప్రచారం ఉంది. కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ కూడా పార్ట్ 2లో ఉండదనే టాక్ వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే మూవీ ప్రమోషన్ లో కమల్ హాసన్ వ్యాఖ్యలు ఉన్నాయనే మాట ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు.

Read more!

ట్రైలర్ తర్వాత కొంత హైప్ వచ్చింది. ఒక్క తమిళంలో మూవీకి మంచి క్రేజ్ ఉంది. ఇతర భాషలలో ఆశించిన స్థాయిలో వైబ్ లేదని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపై చేసిన కామెంట్స్ సినిమాపై ఆసక్తి తగ్గించే ఛాన్స్ లు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే శంకర్ ఇండియన్ 2పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమా కమల్ అభిమానులు అందరిని మెప్పిస్తుందని హామీ ఇస్తున్నారు. అతన్ని డిఫరెంట్ గెటప్స్ లో చూస్తారని అన్నారు.

ఇది ఏమైనా ఇండియన్ 2 మూవీకి వచ్చే సక్సెస్ బట్టి ఇండియన్ 3 సినిమాపై పబ్లిక్ లో ఒక హైప్ క్రియేట్ అవుతుంది. మొదటి సినిమా వచ్చి 28 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఫ్రెష్ ఐడియాతో ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తోనే ఈ సీక్వెల్ తీసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు వాస్తవం అవుతుందనేది జులై 12న తెలిసిపోనుంది.

Tags:    

Similar News

eac