విశ్వనటుడు.. ఈ ఏడాది చివరకు బీభత్సమే..

విభిన్న పాత్రలతో యూనివర్శల్ యాక్టర్ అనే ఇమేజ్ తెచ్చుకున్న సౌత్ ఇండియన్ స్టార్ అంటే వెంటనే కమల్ హాసన్ అని చెబుతారు.

Update: 2024-05-09 04:41 GMT

విభిన్న పాత్రలతో యూనివర్శల్ యాక్టర్ అనే ఇమేజ్ తెచ్చుకున్న సౌత్ ఇండియన్ స్టార్ అంటే వెంటనే కమల్ హాసన్ అని చెబుతారు. చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్ సుదీర్ఘ సినీ ప్రయాణంలో చేయనటువంటి క్యారెక్టర్ లేదని చెప్పొచ్చు. దశావతారం సినిమాలో ఏకంగా 10 భిన్నమైన పాత్రలో కమల్ హాసన్ నటించి మెప్పించాడు. ప్రపంచంలో ఏ స్టార్ కూడా కూడా ఇన్ని పాత్రలు ఒకే సినిమాలు చేసిన దాఖలాలు లేవని చెప్పొచ్చు.

తనని తాను ఒక కమర్షియల్ హీరోగా కంటే నటుడిగానే కమల్ హాసన్ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అందుకే చాలా మంది స్టార్స్ తరహాలో అతనికి పెద్ద కమర్షియల్ మార్కెట్ ఏర్పడలేదు. కానీ ప్రతి ఒక్కరు అభిమానించే నటుడిగా మాత్రం కమల్ హాసన్ గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్ హాసన్ కేవలం నటుడు మాత్రమే కాకుండా రచయిత, దర్శకుడు, సింగర్ గా కూడా టాలెంట్ చూపించారు. విశ్వరూపం సిరీస్ ని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.

చివరిగా కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది కమల్ హాసన్ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీ గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది.

జూన్ 18న ఈ మూవీ రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. శంకర్, కమల్ హాసన్ కలయికలో 28 ఏళ్ళ క్రితం వచ్చిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతోంది. అలాగే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అలాగే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ థగ్ లైఫ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.

ఈ ఏడాది ఆఖరులో ఆ సినిమా రిలీజ్ అవుతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ మూడు సినిమాలు గ్రాండియర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోయే సినిమాలే కావడం విశేషం. ఇవి హిట్ అయితే కమల్ హాసన్ మార్కెట్ వేల్యూ మరింత పెరిగే అవకాశం ఉంటుందనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ మూడింటిలో కమల్ హాసన్ చేస్తోన్న పాత్రలు కూడా వేటికవే ప్రత్యేకం కావడం గమనార్హం.

Tags:    

Similar News