ఫొటో టాక్: నమ్రత గారు.. వెంటనే వీళ్లకు దిష్టి తియ్యండి!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద బాక్సాఫీస్ కింగ్ అయినప్పటికీ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఆయన పర్ఫెప్ట్ కింగ్ అని చెప్పవచ్చు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద బాక్సాఫీస్ కింగ్ అయినప్పటికీ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఆయన పర్ఫెప్ట్ కింగ్ అని చెప్పవచ్చు. తన కుటుంబంతో మహేష్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎట్రాక్ట్ అవుతుంటారు. ఇక రీసెంట్ గా మహేష్ తన కుమార్తె సితారతో కలిసి స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా బ్రాండ్ ప్రమోషన్లలో ఓ రేంజ్ స్టైల్‌తో కనిపించే మహేష్.. ఈసారి తన కూతురితో కలిసి మోడలింగ్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఫొటోషూట్‌లో మహేష్ బాబు క్లాసిక్ కలర్ కాంబినేషన్‌లతో కనిపించగా, సితార మాత్రం రెండు విభిన్న లుక్‌లలో స్టన్నింగ్‌గా మెరిసింది. ఒక ఫొటోలో మహేష్ పింక్ షర్ట్, వైట్ ప్యాంట్‌లో రిఫ్రెషింగ్‌గా ఉంటే, సితార క్యాజువల్ డెనిమ్ షార్ట్‌తో క్యూట్‌నెస్ తో అందంగా దర్శనమిచ్చింది.
మరొక సెట్ ఫొటోలలో మాత్రం మహేష్ బ్లాక్ డ్రెస్‌లో సింప్లీ సూపర్బ్ లుక్‌లో ఉండగా, సితార ఫ్లోరల్ డ్రెస్‌తో క్వీన్ లా మెరిసింది. ఇద్దరి హావభావాలతో కలిపి ఆ ఫొటోలు బ్రాండ్ ప్రమోషన్‌ను మించిన వైరల్ మిరాకిల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరూ ‘ఈ లుక్‌కు దిష్టి తీయాలి’ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోలు ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.
“నమ్రత గారు.. ఇంటికి రాగానే వీళ్లకు దిష్టి తీయండి..” అంటూ ఓ ఫ్యాన్ కామెంట్ చేయగా, మరొకరు.. అన్నా చెల్లి తరహాలో అనిపిస్తున్నారని ఫన్నీగా చెబుతున్నారు. మరికొందరు అయితే.. ఫ్యూచర్ స్టార్ కిడ్.. సితారకు ఇప్పుడు నుంచే ఫ్యాన్ బేస్ ఉంది.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ స్టైల్‌కు, సితార క్యూట్‌నెస్‌కు మిక్స్ అయితే అది ఓ ట్రెండ్ అవుతుందనే అభిప్రాయం నెటిజన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఈ ఫొటోషూట్ ద్వారా ఒకవైపు మహేష్ బ్రాండ్ ప్రమోషన్ చేస్తూనే.. మరోవైపు తన కూతురికి కూడా ఒక స్టార్ డమ్ స్టేజిని సిద్ధం చేస్తున్నట్లుంది. ప్రస్తుతం SSMB29 షూటింగ్‌లో ఉన్న మహేష్, ఈ మధ్యలో ఇలా కుటుంబ సభ్యులతో పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌కు ఓ బోనస్ అనిపిస్తోంది. మరి సితార భవిష్యత్‌లో స్క్రీన్ మీద అసలైన ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పటికి ఫ్యాన్స్ మాత్రం అన్నా చెల్లెల్లా ఉన్న వీళ్లిద్దరిని చూస్తుంటే హాయిగా.. ఉందంటూ ప్రేమగా స్పందిస్తున్నారు.