1997 కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఏమన్నారంటే..
ఇటీవల, తన రాబోయే చిత్రం 'ఇండియన్ 2' ప్రమోషన్ సందర్భంగా కమల్ హాసన్ 'మరుదనాయకం' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు
కమల్ హాసన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి 'మరుదనాయకం'. 1991 లో ప్రకటించిన ఈ చిత్రం, 1997 లో షూటింగ్ ప్రారంభమైంది. కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఆర్థిక సమస్యలు కారణంగా ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. కొంత ఖర్చు చేసిన తరువాత ఆ ప్రాజెక్టు హఠాత్తుగా ఆగిపోవడం కమల్ కు చాలా సమస్యలను తీసుకు వచ్చింది.
ఇటీవల, తన రాబోయే చిత్రం 'ఇండియన్ 2' ప్రమోషన్ సందర్భంగా కమల్ హాసన్ 'మరుదనాయకం' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 106 ఏళ్ల సేనాపతిగా నటిస్తున్న కమల్, మరోసారి మరుదనాయకం ప్రాజెక్ట్ పునఃప్రారంభం చేసే అవకాశం గురించి హ్యూమర్ ఫుల్‌గా మాట్లాడారు. కమల్ హాసన్ తన చరిత్రాత్మక పాత్ర అయిన ముహమ్మద్ యూసఫ్ ఖాన్ పాత్రను 70 ఏళ్ల వయస్సులోనూ తానిచ్చిన సవాలు ఎలా ఉంటుందో అనే విషయం గురించి వివరణ ఇచ్చారు.
అయితే, ఈ ప్రాజెక్ట్ పునఃప్రారంభం చేసే అవకాశం ఉందని సూచించినా, ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 'మరుదనాయకం' తెరపైకి వస్తే ఈ చిత్రం భారతీయ సినిమాలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన చిత్రంగా భావించబదుతుందని తెలుస్తోంది. ఇక ఆ క్యారెక్టర్ ను అయితే కమల్ ఏమాత్రం మరువలేదు అని అనిపిస్తుంది.
ఆ సినిమా ప్రారంభ బడ్జెట్ రూ. 85 కోట్లుగా ప్రకటించబడింది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నించారు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటి చాలెంజ్ లని ఎదుర్కొని చిత్రంలో వయస్సు మార్పులను యథార్థంగా చూపించడం అనేది మామూలు విషయం కాదు. కమల్ ఈ చాలెంజ్ పై గట్టిగానే ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేటి కాలానికి తగ్గట్టుగా సినిమాను మారిస్తే బడ్జెట్ పరిధి మరింత దాటిపోతుంది, భారీ నిర్మాణ వ్యయాలు ఈ చిత్ర భవిష్యత్తుపై అనిశ్చితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. మొత్తానికి, 'మరుదనాయకం' పునఃప్రారంభం కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పునఃప్రారంభం అయితే కమల్ హాసన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అనడంలో అనుమానం లేదు.