పిక్ టాక్‌ : కమల్‌, సిద్దు కనిపించే దానికంటే దగ్గర

ఆ కార్యక్రమం లో చిత్ర యూనిట్ సభ్యులు అందరితో కలిసి కమల్‌ హాసన్ పాల్గొన్న విషయం తెల్సిందే.

Update: 2024-06-27 17:30 GMT

యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నేడు కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలోని ఆయన పాత్ర గురించి కథలు కథలుగా ప్రచారం జరుగుతుంది. చిన్న పాత్ర అనుకున్నాం కానీ చాలా పెద్ద పాత్రను కల్కి లో కమల్‌ చేశాడు అంటూ చాలా మంది సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


కల్కి సినిమా ప్రమోషన్‌ కోసం బాగానే తిరిగిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు భారతీయుడు 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవల ముంబై లో సినిమా ట్రైలర్ లాంచ్‌ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం లో చిత్ర యూనిట్ సభ్యులు అందరితో కలిసి కమల్‌ హాసన్ పాల్గొన్న విషయం తెల్సిందే.

ఆ తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో హాజరు అయ్యేందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులతో కమల్‌ హాసన్ ప్రయాణాలు సాగిస్తున్నాడు. భారతీయుడు 2 లో హీరో సిద్దార్థ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆయన కూడా కమల్‌ తో పాటు దాదాపు అన్ని ప్రమోషనల్‌ కార్యక్రమాలకు హాజరు అవుతున్నాడు.

సిద్దు తో ఒక ప్రయాణం సందర్భంగా తీసుకున్న ఈ పిక్‌ ను కమల్‌ ఇన్‌ స్టా లో షేర్ చేశాడు. ఫోటో తో పాటు వాహనాల మిర్రర్‌ పై ఉండే విధంగా... అద్దంలో వస్తువులు కనిపించే దానికంటే దగ్గరగా ఉంటాయి అన్నట్లుగా కామెంట్‌ పెట్టాడు. సిద్దార్థ్‌ తనకు చాలా ఆప్తుడు అన్నట్లుగా చెప్పకనే కమల్‌ చెప్పాడు.

కమల్‌ షేర్ చేసిన ఈ ఫోటోకు నెటిజన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్ మరియు షేర్స్ లభించాయి. చాలా కాలం తర్వాత కమల్‌ ను చాలా నమ్మకంగా చూస్తున్నామని, ఆయన మనసారా నవ్వుతున్నట్టుగా అనిపిస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కమల్‌ ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆయన నుంచి వచ్చే నెలలో రాబోతున్న భారతీయుడు 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News