క‌మ‌ల్ హాస‌న్ (Vs) ర‌జ‌నీకాంత్.. మ‌ణిర‌త్నం ప్ర‌యోగం?

కోలీవుడ్ కి చెందిన ఇద్ద‌రు లెజెండ‌రీ హీరోల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని మ‌ణిర‌త్నం ఉవ్విళ్లూరుతున్నారు.

Update: 2023-08-17 02:30 GMT

విశ్వ‌నటుడు కమల్ హాసన్ - దర్శకుడు మణిరత్నం క‌ల‌యిక‌లో KH234 (వర్కింగ్ టైటిల్‌) తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌ర్వాత మ‌ణిర‌త్నం ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ ఇది. ఈ జోడీ గతంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా 'నాయకన్' (1987) తో విజ‌యం సాధించారు. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌లో ప్ర‌త్యేక చిత్రంగా నిలిచింది. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బస్టర్ సాధించ‌డ‌మే గాక‌.. జాతీయ చలనచిత్ర అవార్డుతో గౌర‌వం అందుకుంది. క‌మ‌ల్ హాసన్ ఉత్తమ నటుడిగా పుర‌స్కారం ద‌క్కించుకున్నారు.1988 ఆస్కార్‌లకు భార‌త‌దేశం నుంచి అధికారిక ఎంట్రీని ద‌క్కించుకున్న‌ చిత్ర‌మిది.

KH234ని క‌మ‌ల్ హాస‌న్ కి చెందిన‌ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) -మ‌ణిరత్నం మద్రాస్ టాకీస్- ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క‌మ‌ల్‌హాసన్, మ‌ణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్నారు. ఆస్కార్, BAFTA, గోల్డెన్ గ్లోబ్, గ్రామీ విజేత స్వరకర్త A.R. రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.

క‌మ‌ల్ హాసన్ - రత్నం ఇద్దరూ తమ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకుని జోష్ మీద ఉన్న ఈ స‌మ‌యంలో ఈ క‌ల‌యిక ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ -లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ లో విక్ర‌మ్ జూన్‌లో విడుదలై 60 మిలియన్ డాల‌ర్లు వసూలు చేసింది. మద్రాస్ టాకీస్ - లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన మ‌ణిరత్నం తమిళ భాషా చారిత్రక ఇతిహాసం 'పొన్నియిన్ సెల్వన్: 1' సెప్టెంబర్‌లో విడుదలై 60 మిలియన్ డాల‌ర్లు వసూలు చేసింది. రెండు చిత్రాలను ఉద‌య‌నిదికి చెందిన‌ రెడ్ జెయింట్ తమిళనాడులో పంపిణీ చేసింది. ఇక పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 కూడా అసాధార‌ణ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యాల‌తో మ‌ణిస‌ర్- క‌మ‌ల్ స‌ర్ మాంచి హుషారుగా ఉన్నారు.

నిజానికి నాటి క్లాసిక్ హిట్ చిత్రం 'నాయకన్' విజయం తర్వాత మ‌ణిరత్నం - క‌మ‌ల్ హాసన్ పొన్నియ‌న్ సెల్వ‌న్ (క‌ల్కి రాసిన న‌వ‌ల‌) కోసం క‌లిసి ప‌ని చేయాల‌నుకున్నారు. కానీ అది వీలుప‌డ‌లేదు. 35 సంవత్సరాల త‌ర్వాత‌ నేను మిస్టర్ మణిరత్నంతో కలిసి పని చేయబోతున్నందున‌ నేను ఉత్సాహంగా ఉన్నాను. ఇలాంటి ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డం ఉత్తేజాన్నిస్తుంది. ఈ క‌ల‌యిక‌లో మిస్టర్ రెహమాన్ కూడా చేరారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ వెంచర్‌ను పూర్తి చేయ‌డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని క‌మల్ హాసన్ గ‌తంలో అన్నారు. కమల్ హాసన్‌తో మళ్లీ కలిసి పనిచేయడం ఆనందంగా, గౌరవంగా ఉత్సాహంగా ఉంటుంద‌ని మ‌ణిర‌త్నం ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఆస‌క్తిక‌రంగా ఈ ప్రాజెక్టులోకి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రంగ ప్ర‌వేశం చేస్తార‌ని ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తార‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ కి చెందిన ఇద్ద‌రు లెజెండ‌రీ హీరోల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని మ‌ణిర‌త్నం ఉవ్విళ్లూరుతున్నారు. ఆయ‌న‌కు బ‌హుశా ఇదే చివ‌రి సినిమా అవుతుంద‌ని కూడా కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.

మ‌ణి స‌ర్ కి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఎక్కువ కాలం ద‌ర్శ‌కుడిగా కొన‌సాగ‌లేరు. అందువ‌ల్ల చివ‌రి ప్ర‌య‌త్నంగా ఇద్ద‌రు లెజెండ్ ల‌ను ఒకే ఫ్రేమ్ లో క‌ల‌పాల‌ని భావిస్తున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ఇదే నిజ‌మైతే మూండ్రు ముడిచు (1976) -16వ‌య‌తినిలే త‌ర‌హాలో ఈ సినిమా కూడా ర‌జ‌నీ-క‌మ‌ల్ క‌ల‌యిక‌లో మ‌రో అద్భుతం అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

రజనీకాంత్-కమల్ హాసన్ ప‌లు క్లాసిక్ సినిమాలలో కలిసి నటించారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'మూండ్రు ముడిచు' (1976)లో ఈ జోడీ క‌లిసి న‌టించారు. తమిళ-భాషా రొమాంటిక్ డ్రామా చిత్రమిది. ఈ చిత్రంలో శ్రీదేవి, కమల్ హాసన్ ల‌తో పాటు రజనీకాంత్ (విలన్‌గా) న‌టించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా '16 వయత్తినిలే' (1977) చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు.

Tags:    

Similar News