విడాకులైన హీరోలకు కాల్ చేయనన్న నటి!
సూటిపోటి మాటలతో ప్రత్యర్థుల గుండెల్లోకి తూటాలు పేల్చడంలో కంగన ధీశాలి.
సూటిపోటి మాటలతో ప్రత్యర్థుల గుండెల్లోకి తూటాలు పేల్చడంలో కంగన ధీశాలి. అలాంటి తూటా ఒకటి తన శత్రువు గుండెల్లోకి గురి చూసి పేల్చింది క్వీన్. ఇప్పుడు ఆ తూటా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా శత్రువు? అంటే స్టార్ హీరో హృతిక్ రోషన్ కాకుండా మరెవరు? అన్న ప్రశ్న ఎదురైంది.
విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మాజీలకు ఫోన్ లు చేసి నేను నిన్ను మిస్సవుతున్నాను! అనడం గురించి సెటైర్ వేసింది కంగన. సూటి పోటి మాటలతో మాజీ అయిన ఒక స్టార్ హీరో గుండెల్ని చిద్రం చేసింది. తనకు సంప్రదాయ మనస్తత్వం ఉందని, తన మాజీలతో స్నేహంగా ఉండలేనని చెప్పింది కంగన. అసలు తాను విడాకులు ఇచ్చే టైప్ కాదని కూడా చెప్పుకుంది. నటి కం రాజకీయ నాయకురాలు కంగన విడాకుల తర్వాత స్నేహంగా ఉండటంపై తనదైన శైలిలో సెటైర్ వేసింది. తాను మాత్రం తన భాగస్వామి నుండి విడాకులు తీసుకునే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించింది. విడాకులు తీసుకుని ఆపై వారితో స్నేహంగా ఉంటారని, ఇలాంటివారిని రెగ్యులర్‌గా చూస్తున్నామని కూడా కంగన నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తూ శత్రువును టార్గెట్ చేసింది.
కంగనా విడాకుల వ్యవహారాలను టచ్ చేయగా, చాలా మంది నెటిజన్లు తన మాజీ భార్య సుస్సేన్ ఖాన్‌తో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించే హృతిక్ రోషన్ ని టార్గెట్ చేసిందా? అంటూ ఆశ్చర్యపోయారు. కంగనా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ``నేను ఆ రకం కాదు.. మాజీలకు ఫోన్ చేసి మాట్లాడను. నేను చాలా సంప్రదాయవాదిని`` అని అన్నారు. ``హలో డార్లింగ్, మీరు ఇక్కడ ఉన్నారు.. నేను నిన్ను మిస్సవుతున్నాను అని అనలేను.. అయినా అలాంటప్పుడు విడాకులు తీసుకోవడం దేనికి?`` అని కంగన సైటైర్ వేసింది.
ఒక వ్యక్తి ఈ క్లిప్‌ను రెడ్డిట్‌లో షేర్ చేసి ``హృతిక్‌పై కంగనా విసుర్లు చూసారా?`` అంటూ క్యాప్షన్‌ని ఇచ్చాడు.``ఇదిగో. హృతిక్‌ని ఉపయోగించుకుని మరో సినిమా ప్రమోషన్`` అని అన్నారు. ఒక వ్యక్తి ఇలా రాసాడు. ``బ్రేకప్ తర్వాత ఆమె అతనికి ఆ ఇమెయిల్ లు పంపలేదా?`` అని రాసాడు. ఆమె కొన్నిసార్లు చాలా ఫన్నీ.. కంగనా ఇలాగే ఉండండి - నిజాయితీగా ఉండండి.. మీరు చాలా ప్రతిభావంతురాలు.. చమత్కారం అలాగే మీ కడుపులో మంటలు ఉన్నాయి. మీరు ప్రతిరోజూ ఎందుకు విషపూరితంగా మారతారు?! అని ప్రశ్నించారు.
గతంలో ఆ ఇద్దరి మధ్యా ఏం జరిగింది?
క్రిష్ 3 చిత్రీకరణ సమయంలో కంగనా రనౌత్ - హృతిక్ రోషన్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. హృతిక్‌తో కలిసి పారిస్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు కంగనా పేర్కొంది. అయితే కంగన వాదనలను హృతిక్ ఖండించారు. క్రిష్ 3లో కలిసి పనిచేసిన తర్వాత, కంగనా-హృతిక్ మధ్య రిలేషన్ చెడింది. ఇరువురూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. హృతిక్ తో తనకు సంబంధం ఉందని కంగన రచ్చ చేయగా, దానిని అతడు ఖండించాడు. ఈ గొడవ కోర్టు కేసుల వరకూ వెళ్లింది. అదే క్రమంలో సుస్సానేతో హృతిక్ విడాకుల వ్యవహారం కూడా తెలిసినదే.
హృతిక్ రోషన్ ఇప్పుడు సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నాడు. అతడి ఇద్దరు కొడుకుల తల్లి అయిన తన మాజీ భార్య సుస్సేన్ ఖాన్‌తో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. హృతిక్ - సబా తరచుగా సుస్సేన్ .. ఆమె కొత్త భాగస్వామి అర్స్లాన్ గోనితో కలిసి కనిపిస్తారు. నలుగురూ ఒకరి గురించి మరొకరు చాలా ఇష్టంగా మాట్లాడుకుంటారు. దీంతో కంగనా చేసిన కామెంట్ హృతిక్ పైనే అని రెడ్డిట్ అభిప్రాయపడ్డాడు. కంగన హృతిక్ పై విరుచుకుపడుతుందా? అని కూడా నెటిజన్లు ఆరాతీశారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కంగనా రనౌత్ ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కంగన ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. అదే కాకుండా దర్శకురాలిగా ప్రాజెక్టును డీల్ చేసింది. సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయనున్నారు.