ఆ స్టార్ హీరో పాన్ ఇండియా రిలీజ్ లాక్ అయిన‌ట్లేనా?

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య పిరియాడిక్ థ్రిల్ల‌ర్ `కంగువ` తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-04-15 05:53 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య పిరియాడిక్ థ్రిల్ల‌ర్ `కంగువ` తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. పిరియాడిక్ థ్రిల్ల‌ర్ కి టైమ్ ట్రావెల్ నేప‌థ్యాన్ని జోడించ‌డంతో? ఈ కాంబో కొత్త‌గా ఏదో చెప్ప‌బోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం `కంగువ` రిలీజ్ ఎప్పుడు? అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఇప్ప‌టికే అక్టోబ‌ర్ -డిసెంబ‌ర్ నెల‌ల్లోనే రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

అక్టోబ‌ర్ లో మ‌రికొన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. అక్టోబ‌ర్ లో `దేవ‌ర` వ‌స్తే! సూర్య క‌చ్చితంగా వెన‌క్కి త‌గ్గాల్సిందే. దాంతో పాటు `గేమ్ ఛేంజ‌ర్` కూడా అదే నెల‌లో రిలీజ్ అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి సూర్య తెలుగు మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని అక్టోబ‌ర్ అతి క‌ష్టం అని చెప్పొచ్చు. ఆ త‌ర్వాత ఆప్ష‌న్ లో ఉంది డిసెంబ‌ర్. ఇక్క‌డైతే కాస్త సేఫ్ గానే రిలీజ్ చేసుకోవ‌చ్చు. ఆనెల‌లో పెద్ద‌గా సినిమాలేవి రిలీజ్ లేవు. ఎక్కువ‌గా బాలీవుడ్ రిలీజ్ లుంటాయి త‌ప్ప‌! టాలీవుడ్..కోలీవుడ్ నుంచి పోటీ ఉండ‌దు.

అటుపై వ‌చ్చేది సంక్రాంతి మాసం కాబ‌ట్టి సౌత్ హీరోలంతా జ‌న‌వ‌రిని టార్గెట్ చేస్తారు. మ‌రి సూర్య ఆ ఛాన్స్ తీసుకోవ‌చ్చు! క‌దా? అంటే అక్క‌డో చిక్కుంది. ఈ సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ భాగ‌స్వామిగా ఉంది. ఇదే సంస్థ తెలుగులో చిరంజీవితో కూడా `విశ్వంభ‌ర` నిర్మిస్తుంది. ఆ సినిమా ఇప్ప‌టికే సంక్రాంతి డేట్ లాక్ చేసుకుంది. కాబ‌ట్టి `కంగువ` కి సంక్రాంతి ఛాయిస్ లేదిక్క‌డ‌. ఆ త‌ర్వాత రిలీజ్ చేద్దామనుకుంటే బాగా డిలే అవుతుంది.

కాబ‌ట్టి సూర్య ముందు కేవ‌లం డిసెంబ‌ర్ ఒక్క‌టే క‌నిపిస్తుంది. రిలీజ్ చేస్తే 2024 ముగింపు మాసంలో రిలీజ్ చేయాలి. లేదంటే పోటీకి సై అంటూ అక్టోబ‌ర్ లో రంగంలోకి దిగాల్సిందే. మ‌రి స్టూడియో గ్రీన్-యూవీ క్రియేష‌న్స్ ప్లానింగ్ ఎలా ఉంది? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం కంగువ షూటింగ్ ద‌శలో ఉంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఏక‌కాలంలో జ‌రుగుతున్నాయి.

Tags:    

Similar News