కంగువ.. ఇలా అయితే కనెక్ట్ కాదేమో?
ట్రైలర్ చూస్తున్నంత సేపు సరికొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకులకి కలిగిందనే మాట వినిపిస్తోంది.
సూర్య హీరోగా యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించిన పాన్ వరల్డ్ మూవీ కంగువ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 18 మిలియన్ వ్యూస్ ని కంగువ తమిళ్ ట్రైలర్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు సరికొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకులకి కలిగిందనే మాట వినిపిస్తోంది.
కంప్లీట్ గా పూర్వ కాలానికి సంబంధించిన ట్రైబల్ వారియర్ గా సూర్యని ట్రైలర్ లో ఆవిష్కరించారు. అలాగే ట్రైబల్ లో మరో వర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా బాబీ డియోల్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుని ఎక్కువగా ప్రెజెంట్ చేశారు. ట్రైలర్ కి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే ఈ సినిమా కథాంశం గతం, వర్తమానం కలిసి ఉంటుందని గతంలో డైరెక్టర్ శివ క్లారిటీ ఇచ్చారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ గా దీనిని రెడీ చేస్తున్నారనే ప్రచారం నడిచింది. సూర్య రెండు డిఫరెంట్ టైం లైన్స్ లో రెండు క్యారెక్టర్స్ ని మూవీలో చేస్తున్నాడని టాక్ బయటకొచ్చింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఎక్కడా కూడా వర్తమానాన్ని టచ్ చేసే విధంగా విజువల్స్ లేవు. నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా ఈ సినిమాలో ప్రెజెంట్ స్టోరీ గోవా నేపథ్యంలో కూడా ఉంటుందని కూడా చెప్పారు.
ఈ రెండు భిన్నమైన టైం లైన్స్ ని కలిపి కథని శివ ఎలా చెబుతున్నాడో చూడాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. అయితే ట్రైలర్ లో మాత్రం కేవలం ఫారెస్ట్ బ్యాంక్ డ్రాప్ లో ట్రైబల్ వారియర్ కంగు పోరాటాలని మాత్రమే శివ ఆవిష్కరించారు. మెయిన్ స్టోరీని పూర్తిగా చెప్పకుండా ఆడియన్స్ ని డీవియేట్ చేసే విధంగా కంగువ ట్రైలర్ ఉందనే అభిప్రాయం ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. దిశా పటాని క్యారెక్టర్ ని కూడా ట్రైలర్ లో రివీల్ చేయలేదు.
ఈ ట్రైలర్ కి వస్తోన్న స్పందన చూసి మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ట్రైలర్ లో ఒక కథ చెప్పి తరువాత మూవీలో ఇంకో కథని చూపిస్తే ఆడియన్స్ సింక్ అవ్వకపోవచ్చనే మాట వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందనేది చూడాలి. ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.