`కన్నప్ప` న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి
మంచు అండ్ కో 'కన్నప్ప' చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మంచు అండ్ కో 'కన్నప్ప' చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ బాబు-విష్ణు సంయు క్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ కాన్వాస్ పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ ..శివరాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటుల్ని రంగంలోకి దించే పాన్ ఇండియానే షేక్ అవ్వాలి అంటూ ఎక్కడా రాజీ పడటం లేదు. ఓ కీలక పాత్రకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కూడా సీన్ లోకి తెచ్చారు.
ఇక సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా స్విట్జర్లాండ్ లోనే చేస్తోన్న సంగతి తెలిసిందే. 80 శాతం షూటింగ్ అక్కడే ప్లాన్ చేసినట్లు విష్ణు ముందే ప్రకటించారు. అక్కడ ప్రకృతిని..అందమైన ప్రదేశాల్ని అద్భతంగా తెరపైకి తీసుకొస్తున్నట్లు.. ఇలాంటి చిత్రాలకు కేవలం న్యూజిలాండ్ మాత్రమే కరెక్ట్ అని భావించి అక్కడే ప్లాన్ చేసినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమా `లార్డ్ ఆఫ్ రింగ్స్` లాంటి ప్రఖ్యాత చిత్రాన్ని చిత్రీకరించిన లొకేషన్ లోనే కన్నప్పని చిత్రీకరించడం విశేషం. దేవుడి సృష్టించిన అందమైన పెయింటింగ్ న్యూజిలాంటి నగరంలో కన్నప్ప బావోద్వేగాలు మరింత ప్రభావంతంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయినట్లు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. `న్యూజిలాండ్ లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం` అని రాసుకొచ్చారు.
దీంతో కన్నప్ప కి సంబంధించి న్యూజిలాండ్ లో పూర్తి చేయాల్సిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా న్యూజిలాండ్ లోనూ ఉంటూ షూటింగ్ నిర్వహించి హైదరాబాద్ తిరిగొ స్తున్నారు. తదుపరి షెడ్యూల్స్ ఎక్కడ ఉంటుందన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.